logo

ఆహ్లాదమని పెంచారు.. అడ్డొస్తున్నాయని నరికారు

అవి ఏళ్ల క్రితం నాటిన మొక్కలు.. నేడు మహావృక్షాలుగా మారి నీడనిస్తున్నాయి. రహదారికి ఇరువైపులా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అట్లాంటి చెట్లకు రంపం పోటు పడింది.

Updated : 09 Feb 2023 05:59 IST

న్యూస్‌టుడే, మెదక్‌, చేగుంట

నరికిన తర్వాత ఇలా..

అవి ఏళ్ల క్రితం నాటిన మొక్కలు.. నేడు మహావృక్షాలుగా మారి నీడనిస్తున్నాయి. రహదారికి ఇరువైపులా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అట్లాంటి చెట్లకు రంపం పోటు పడింది. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్నాయని వాటిని మొదళ్ల నుంచి నరికివేస్తున్నారు. జిల్లా కేంద్రం మెదక్‌ పట్టణంలో రామాయంపేట రహదారిలో బుధవారం పలు చెట్లను తొలగించారు. మెదక్‌ నుంచి ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి 765డిజీ మంజూరైన సంగతి విధితమే. గతేడాది నవంబరులో ప్రధాని మోదీ వర్చువల్‌ పద్ధతిలో విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. టెండర్లు పూర్తవ్వడంతో గుత్తేదారు పనులు మొదలుపెట్టే యోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే మెదక్‌-రామాయంపేట రహదారిలో ఇరువైపులా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. స్థానిక బోధన్‌ చౌరస్తా నుంచి పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు పట్టణంలోని తారకరామనగర్‌లో రోడ్డుకు ఇరువైపులా ఉన్నవాటిని, అవుసుపల్లి వద్ద యంత్రంతో తొలగించారు. దీంతో రహదారి బోసిపోతోంది. ఇక మెదక్‌ నుంచి రామాయంపేట పట్టణం వరకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించనున్నారు.  తీగలకు అడ్డువస్తున్నాయని చేగుంట నుంచి బోనాలకు వెళ్లే మార్గంలో 65 వరకు మర్రి, రావి, వేప, గుల్‌మోహర్‌ తదితర చెట్లను విద్యుత్తు తీగలకు అడ్డువస్తున్నాయని ట్రాన్స్‌కోకు చెందిన గుత్తేదారు నరికివేశారు. మూడేళ్ల క్రితం అటవీ శాఖ ఆధ్వర్యంలో రహదారికి ఇరువైపుల పెద్ద ఎత్తున వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షించారు. ఎదుగుతున్న తరుణంలో బుధవారం వాటిని తొలగించారు.  తీగలు ఉంటే కొమ్మలు నరకాల్సింది పోయి చెట్లను నరికివేయటం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

చేగుంట బోనాలలో ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు