logo

ఓటుతో ఆధార్‌.. అనుసంధానం.. మందగమనం

పటాన్‌చెరు నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం. ఐదు మండలాల పరిధిలో వలస కుటుంబాలే అధికం.

Published : 09 Feb 2023 01:59 IST

వివరాలు సేకరిస్తున్న బీఎల్‌వోలు

న్యూస్‌టుడే, జిన్నారం: పటాన్‌చెరు నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం. ఐదు మండలాల పరిధిలో వలస కుటుంబాలే అధికం. నియోజకవర్గంలో 3,29,647 మంది ఓటర్లు ఉండగా ఇప్పటికీ 2,17,779 మంది ఓటుకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ పూర్తిచేశారు. మిగిలిన 1,12,117 మంది ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఐడీఏ బొల్లారం పురపాలిక పరిధిలో 32 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 29,327 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతానికి 15,270 మంది మాత్రమే స్పందించారు. మిగిలిన 14,124 మంది ఓటర్లు ముందుకు రాలేదు. దీంతో పట్టణ పరిధిలో 52.07 శాతం మాత్రమే ప్రక్రియ పూర్తయింది. ఓటర్ల జాబితాలో ఒక్కరి పేర్లే రెండు మూడు సార్లు వివిధ బూత్‌ల పరిధిలో ఉండటం, ఇతర పారిశ్రామిక వాడలకు కార్మికులు వెళ్లిపోవటం, అద్దె ఇళ్లు మారి కొత్తగా ఓటు పొందటం, కొందరు తమ స్వస్థలాల్లోనే ఓటు హక్కు కలిగి ఉండేలా ఏర్పాట్లు చేసుకోవటం వంటి కారణాల వల్ల అనుసంధాన శాతం తక్కువగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. యవ ఓటర్లు వివిధ ప్రాంతాలకు ఉపాధి, ఉద్యోగాలకు వెళ్లి పోయారు. అమీన్‌పూర్‌ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సైతం బదిలీలతో ఇతర ప్రాంతాలకు వెళ్లటం వల్ల ఓటుకు ఆధార్‌ అనుసంధానం అనుకున్న లక్ష్యాన్ని సాదించలేక పోతున్నారు.

బీఎల్‌వోలు ఇంటింటికీ వెళుతున్నారు: దశరథ్‌సింగ్‌, తహసీల్దార్‌, జిన్నారం

ఓటుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లారు. కొందరు ఓటర్లు స్పందించకపోవడం సమస్యగా మారింది. చిరునామా ఆధారంగా ఇంటికి తాఖీదు అతికించి వస్తున్నారు. స్పందించకుంటే చర్యలు తీసుకుంటాం. చివరి ప్రయత్నంగా రాజకీయ పార్టీల నేతలతోనూ సమావేశాలు ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని