logo

సీబీఐ విచారణతోనే నిరుద్యోగులకు న్యాయం: భాజపా

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే డిమాండ్‌ చేశారు.

Published : 21 Mar 2023 02:32 IST

నిరసన దీక్షలో పాల్గొన్న భాజపా నాయకులు

సంగారెడ్డి అర్బన్‌, నారాయణఖేడ్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే డిమాండ్‌ చేశారు. సోమవారం సంగారెడ్డి కొత్త బస్టాండ్‌ సమీపంలో ‘మా నౌకర్లు.. మాగ్గావాలే’ పేరిట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ నిరంకుశ పాలన అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. నిరసనలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్‌రెడ్డి, కె.జగన్‌, డాక్టర్‌ రాజుగౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మంత్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ పోచారం రాములు పాల్గొన్నారు. టీఎస్‌పీˆఎసీˆ్స ప్రశ్నపత్రాల లీకేజీకి మంత్రి కేటీఆర్‌ బాధ్యత వహించాల్సిందేనని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి జన్‌వాడె సంగప్ప డిమాండ్‌ చేశారు. సోమవారం ఖేడ్‌ రాజీవ్‌కూడలి సమీపంలో నిరసన దీక్ష నిర్వహించారు. పార్టీ ఖేడ్‌ అసెంబ్లీ కన్వీనర్‌ రజనీకాంత్‌, సీˆనియర్‌ నాయకులు మారుతిరెడ్డి, సాయిరాం, సుధాకర్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని