ఊరట దక్కాలని..వేదన వినిపించారు
అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా కాలం గడుస్తుందే కానీ తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని బాధితులు ఆవేదనగా చెబుతున్నారు.
ఈనాడు, సంగారెడ్డి: అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా కాలం గడుస్తుందే కానీ తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని బాధితులు ఆవేదనగా చెబుతున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చి వారు వినతులు అందించారు. ఊరట దక్కేలా నిర్ణయం తీసుకోవాలని అధికారులను వేడుకున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ ఆర్డీవోలు మెంచు నగేష్, రమేష్‌బాబు, అంబాదాస్ ప్రజావాణికి వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించారు.
తల్లి కోసం కదిలొచ్చిన బిడ్డలు
పుల్కల్ మండలం బస్వాపూర్‌కు చెందిన కె.నర్సమ్మకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఆమె భర్త భాగయ్య 18ఏళ్ల క్రితమే మరణించారు. గతంలోనే ముగ్గురు కుమారులకు భూమి పంచి ఇచ్చారు. కొన్ని సంవత్సరాలుగా ఒక్క కుమారుడే తమ తల్లి బాగోగులు చూస్తున్నాడని, మిగతా వారు పట్టించుకోవడం లేదని ఆమె నలుగురు బిడ్డలు కలెక్టరేట్‌కు వచ్చారు. న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
రూ.లక్ష ఇస్తానని.. రూ.40వేలు కాజేశారు
హత్నూర మండలం ముచ్చర్లకు చెందిన చిత్తారి శంకరయ్య కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇది గమనించి సుల్తాన్‌పూర్‌కి చెందిన శ్రీకాంత్ ప్రభుత్వం నుంచి రూ.లక్ష మొత్తానికి సంబంధించిన సహాయం చెక్కులు వచ్చాయని నమ్మబలికాడు. రూ.40వేలు ఇస్తే వాటిని అందిస్తానన్నారు. దీంతో శంకరయ్య తెలిసిన వారి వద్ద అప్పు చేసి మరీ ఆ డబ్బు శ్రీకాంత్‌కు అందించాడు. చివరకు తాను మోసపోయాయని తెలుసుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
పత్రమిచ్చి.. స్థలాన్ని చూపలేదు
రామచంద్రాపురం మండలం కానుకుంటకు చెందిన గుంటిపోషమ్మకు అధికారులు గతంలో రామేశ్వరం బండలో 75గజాల స్థలాన్ని కేటాయించారు. కానుకుంటలో తమ ఇంటిని కూల్చిన తర్వాత కేవలం పత్రాన్ని మాత్రమే అందించారని ఆమె చెబుతున్నారు. దాదాపు 10ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇంటిస్థలం ఎక్కడుందో చూపడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి సోమవారం వస్తున్నా
మల్కోళ్ల శంకరయ్యకు సంగారెడ్డి మండలం కోత్లాపూర్‌లోని జుల్మలకుంట పక్కనే సర్వేసంఖ్య 23లో పది గుంటల భూమి ఉంది. 2016లో ఒకరు ఈ కుంటలో అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టారు. మట్టినంతా తరలించారు. అదే సమయంలో శంకరయ్య పది గుంటల భూమినీ తవ్వేశారు. తనకు న్యాయం చేయాలని ఆయన అయిదేళ్లుగా ప్రతి సోమవారం ప్రజావాణికి వస్తున్నారు. ఇప్పటికీ న్యాయం జరగలేదు.
పరిహారం విషయంలో అన్యాయం
జాతీయ రహదారి 161బీ విస్తరణ కోసం చేస్తున్న భూసేకరణలో తమకు అన్యాయం జరుగుతోందని న్యాల్‌కల్ మండలం రాఘవాపూర్‌కు చెందిన రైతులు ఆరోపించారు. తమ గ్రామానికి ఆరుకిలోమీటర్ల దూరంలో ఎకరాకు రూ.16లక్షలు ఇస్తుండగా.. తమ వద్ద రూ.5లక్షలే ఇస్తుండటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ప్రజావాణిలో అధికారులకు కలిసి వినతిపత్రం అందించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime news: ఠాణే హత్య కేసు.. మృతదేహం ఎలా మాయం చేయాలో గూగుల్‌లో సెర్చ్ చేశాడు!
-
Politics News
Rahul Gandhi: గడ్డం పెంచుకుంటే ప్రధాని అయిపోరు: సామ్రాట్ చౌదరి
-
Movies News
Anasuya: విజయ్ దేవరకొండతో మాట్లాడటానికి ప్రయత్నించా: అనసూయ
-
Politics News
Siddaramaiah: సీఎం కుర్చీ సంతోషాన్నిచ్చే చోటు కాదు..: సిద్ధరామయ్య
-
General News
TSPSC: Group-1 ప్రిలిమ్స్ రాసే వారికి TSPSC సూచనలు
-
Politics News
JP Nadda: ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తాం: జేపీ నడ్డా