logo

‘భారాస బంగాళాఖాతంలో కలవడం ఖాయం’

రానున్న శాసనసభ ఎన్నికల్లో భారాస పార్టీని, వారి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

Published : 21 Mar 2023 02:42 IST

దుబ్బాకలో జరిగిన నిరసన దీక్షలో మాట్లాడుతున్న రఘునందన్‌రావు

న్యూస్‌టుడే - దుబ్బాక, సిద్దిపేట అర్బన్‌: రానున్న శాసనసభ ఎన్నికల్లో భారాస పార్టీని, వారి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. రాష్ట్ర భాజపా ఇచ్చిన పిలుపు మేరకు టీఎస్‌పీఎస్సీలో అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ, సోమవారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో భాజపా చేపట్టిన నిరసన దీక్షలో పలు డిగ్రీ కళాశాలల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ విలేకరులతో వెటకారంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ, రాజీనామా చేయాలని మంత్రి కేటీఆర్‌ను ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తే, భాజపాపై ఆయన ఎదురుదాడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బంగారు తెలంగాణలో సర్పంచులు తాము చేసిన పనులకు నిధులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. నాయకులు ఎస్‌.ఎన్‌ చారి, చింత సంతోశ్‌, అంబటి బాలేశ్‌గౌడ్‌, మచ్చ శ్రీనివాస్‌, పుట్ట వంశీ, సుంకోజి ప్రవీణ్‌, రోశయ్య, అరిగే కృష్ణ, వివిధ మండలాల భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తాలో భాజపా జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి నాయకులు శ్రీనివాస్‌, రామచందర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహారెడ్డి, పరశురాములు తదితరులు నిరసన దీక్షలో పాల్గొన్నారు.

సిద్దిపేటలో భాజపా జిల్లా అధ్యక్షుడు, నేతలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని