logo

సీపీఆర్‌తో ప్రాణరక్షణ: ఎమ్మెల్యే

గుండెపోటు వచ్చిన వారికి సీపీఆర్‌ నిర్వహించడం ద్వారా ప్రాణాలను కాపాడొచ్చని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.

Published : 22 Mar 2023 01:06 IST

సీపీఆర్‌ చేస్తున్న పద్మా దేవేందర్‌రెడ్డి, చిత్రంలో పాలనాధికారి రాజర్షి షా

మెదక్‌, న్యూస్‌టుడే: గుండెపోటు వచ్చిన వారికి సీపీఆర్‌ నిర్వహించడం ద్వారా ప్రాణాలను కాపాడొచ్చని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తినే ఆహారం, అలవాట్లు తదితర కారాణాలతో చిన్న వయసులోనే గుండెపోటు వస్తోందన్నారు. మిగతా రోగాలకు కొంత ఆలస్యమైనా చికిత్స అందించొచ్చన్నారు. గుండెపోటు వచ్చిన వారికి మాత్రం వైద్యుడి కోసం వేచి చూడకుండా వెంటనే సీపీఆర్‌ నిర్వహించడం ద్వారా ప్రాణాలు దక్కే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పాలనాధికారి రాజర్షి షా మాట్లాడుతూ.. ఇటీవల వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుతో చనిపోతున్నారన్నారు. వారికి సకాలంలో సీపీఆర్‌ ద్వారా ప్రాణాలను రక్షించవచ్చన్నారు. జిల్లాలో నాలుగు మాస్టర్‌ ట్రైనీ బృందాల ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లా వైద్యాధికారి చందూనాయక్‌ మాట్లాడుతూ.. సీపీఆర్‌ అంటే ప్రజల్లో చాలా మందికి అవగాహన వచ్చిందన్నారు. సమావేశంలో పుర అధ్యక్షుడు చంద్రపాల్‌, జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, కౌన్సిలర్‌ జయరాజ్‌, ఆంజనేయులు, కో-ఆప్షన్‌ సభ్యుడు ఉమర్‌, డీసీహెచ్‌ పి.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని