logo

వృత్తి నైపుణ్యం ముఖ్యం

మత్స్యశాఖ సహకార సంఘంలో సభ్యత్వ నమోదుకు వృత్తిలో నైపుణ్యం కలిగి ఉండాలని జిల్లా మత్స్యశాఖ అధికారిణి రజని అన్నారు.

Published : 22 Mar 2023 01:06 IST

మత్స్యశాఖ జిల్లా అధికారిణి

రజనిని సత్కరిస్తున్న సభ్యులు

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: మత్స్యశాఖ సహకార సంఘంలో సభ్యత్వ నమోదుకు వృత్తిలో నైపుణ్యం కలిగి ఉండాలని జిల్లా మత్స్యశాఖ అధికారిణి రజని అన్నారు. మండలంలోని ధర్మరాజుపల్లి ఊర చెరువును మంగళవారం ఆమె సందర్శించి మత్య్సకారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మత్స్యశాఖ సహకార సంఘంలో ప్రతి ఒక్కరూ సభ్యత్వం పొందాలని, వీరికి అన్ని కులవృత్తుల మాదిరిగా రాయితీలు, బీమా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. చెరువులో చేపలు పట్టుకొని అమ్ముకునే వారికి రాయితీ కింద పరికరాలను అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ధర్మరాజుపల్లి చెరువు వద్ద మత్స్యశాఖ సహకార సంఘంలో అర్హత కోసం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు. ధర్మరాజుపల్లి, కోనాయిపల్లి(పీటీ), చెట్లగౌరారం, తూప్రాన్‌ మండలంలోని వట్టూరు, వెంకటాయపల్లికి చెందిన 200 మంది పోటీల్లో పాల్గొన్నారు. వారు చేపలు పట్టే విధానాన్ని ఆమె పరిశీలించారు. ఇందులో అర్హత పొందిన వారికి ధ్రువీకరణ పత్రాలను అందించారు. చంద్రశేఖర్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని