logo

ఇంటర్‌ పరీక్షల తరవాత ఎంసెట్‌ కోచింగ్‌

ఇంటర్‌ పరీక్షలు పూర్తికాగానే ఎంసెట్‌, నీట్‌, ఐఐటీకి విద్యార్థులకు కోచింగ్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల ప్రాంతీయ సమన్వయకర్త ప్రభాకర్‌ తెలిపారు.

Published : 22 Mar 2023 01:06 IST

మాట్లాడుతున్న ప్రభాకర్‌

కౌడిపల్లి, న్యూస్‌టుడే: ఇంటర్‌ పరీక్షలు పూర్తికాగానే ఎంసెట్‌, నీట్‌, ఐఐటీకి విద్యార్థులకు కోచింగ్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల ప్రాంతీయ సమన్వయకర్త ప్రభాకర్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని తునికి బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చేనెల నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఫలితాలను సాధించడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్నాయని, పూర్తికాగానే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు ఉచితంగా కోచింగ్‌ ప్రారంభిస్తామన్నారు. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల్లో 98 శాతం సాధించిన విద్యార్థులకు గురుకుల సొసైటీ తరఫున రూ.10వేల చొప్పున పారితోషికం ఇవ్వనున్నట్లు ఆర్‌సీవో తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపల్‌ శివప్రసాద్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ రాజశేఖర్‌, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని