logo

సన్నివేశం.. రామదర్శనం..

ఓ వైపు ఆంజన్న మందిరం.. మరోవైపు కలశ రూపంలో సత్యనారాయణస్వామి వ్రత మండపం.. చుట్టూ ఆహ్లాదకర అటవీ ప్రాంతం.. ఇవి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామ పరిధి చాకరిమెట్లలోని సహకార ఆంజనేయస్వామి మందిరం విశేషాలు.

Published : 22 Mar 2023 01:06 IST

చాకరిమెట్లలో కొలువుదీరిన రామాలయం
న్యూస్‌టుడే, శివ్వంపేట

ఓ వైపు ఆంజన్న మందిరం.. మరోవైపు కలశ రూపంలో సత్యనారాయణస్వామి వ్రత మండపం.. చుట్టూ ఆహ్లాదకర అటవీ ప్రాంతం.. ఇవి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామ పరిధి చాకరిమెట్లలోని సహకార ఆంజనేయస్వామి మందిరం విశేషాలు. ఇక ఇక్కడ సరికొత్త రూపంలో రామమందిరం కొలువుదీరింది. రామాయణంలోని సన్నివేశాల కళారూపాలతో ప్రతిష్ఠోత్సవాలకు సిద్ధమైంది.

నేటి నుంచి ఉత్సవాలు

బుధవారం నుంచి 24 వరకు ప్రతిష్ఠోత్సవాలు జరుగుతాయి. 25 నుంచి 30 వరకు రామ తారక మంత్ర హోమం, 30న శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు, ప్రముఖులకు సౌకర్యాలు కల్పిస్తామని, ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఈవో శ్రీనివాస్‌ వివరించారు.


175 కళారూపాలు

భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న సహకార ఆంజనేయ స్వామికి ఊపిరి అయిన రామభద్రుడి ఆలయాన్ని సత్యనారాయణ స్వామి వ్రత మండపం పక్కన ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించారు. 600 గజాల స్థలంలో ఏర్పాటు చేశారు. తమిళనాడుకు చెందిన శిల్పికారుడు మురుగన్‌ నేతృత్వంలో రామాయణ సన్నివేశాల శిల్పాలను చెక్కించారు. 175 కళారూపాలు కొలువుదీరాయి. 4 అడుగుల ఎత్తుతో సీతారాముల ప్రతిమను ప్రత్యేకంగా తయారుచేయించారు. మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌కు చెందిన వర్గంటి దశరథరెడ్డి రామమందిరం నిర్మాణానికి సంకల్పించారు. తన ఆస్తిలో కొంత విక్రయించి రూ.1.40 కోట్లకు పైగా నిర్మాణానికి వెచ్చించారు. తమిళనాడుకు చెందిన శిల్పికళాకారులు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.


అందరికీ తెలిసేలా..
బి.ఆంజనేయశర్మ, ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్‌

రామాయణం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో రామమందిరం నిర్మాణానికి పూనుకున్నాం. ఘట్టాలన్నింటినీ శిల్పాలతో వివరించాం. దాత దశరథరెడ్డి సహకారం ఎనలేనిది. చాకరిమెట్లలో వెలిసిన సహకార ఆంజనేయస్వామి చెంతన ఈ గుడిని నిర్మించడం సంతోషంగా ఉంది. బుధవారం ప్రతిష్ఠోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని