logo

కల్యాణ వేడుక.. ఆర్టీసీ కానుక

ఆర్టీసీ ఆదాయ ఆర్జనకు వినూత్న మార్గాలను ఎంచుకుంటోంది. 2020 జూన్‌ 19న కార్గో, పార్సిల్‌ సేవలను ప్రారంభించింది. కార్గోను లాజిస్టిక్స్‌గా మార్చి ఏఎం 2 పీఎం పేరుతో దేశవ్యాప్త సేవలకు శ్రీకారం చుట్టింది.

Published : 22 Mar 2023 01:06 IST

న్యూస్‌టుడే, మెదక్‌, అర్బన్‌, సంగారెడ్డి టౌన్‌

మెదక్‌ కొత్త బస్టాండ్‌లోని లాజిస్టిక్స్‌ కేంద్రం

ఆర్టీసీ ఆదాయ ఆర్జనకు వినూత్న మార్గాలను ఎంచుకుంటోంది. 2020 జూన్‌ 19న కార్గో, పార్సిల్‌ సేవలను ప్రారంభించింది. కార్గోను లాజిస్టిక్స్‌గా మార్చి ఏఎం 2 పీఎం పేరుతో దేశవ్యాప్త సేవలకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ.. ఆదరణ పెరిగేలా సమాలోచనలు చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతోంది.

9 డిపోల పరిధిలో..

గతేడాది శ్రీరామనవమి సందర్భంగా లోక కల్యాణం.. పచ్చ తోరణం పేరుతో భద్రాచలంలో జరిగే సీతారామచంద్ర కల్యాణంలో వినియోగించే పవిత్రమైన తలంబ్రాలు భక్తులకు పొందే అవకాశాన్ని ఆర్టీసీ కార్గో కల్పించింది. ఈ సారి సైతం దీన్ని కొనసాగిస్తున్నారు. లాజిస్టిక్స్‌ కేంద్రాల్లో రూ.116 చెల్లించి బుక్‌ చేసుకుంటే సరిపోతుంది. మెదక్‌ రీజియన్‌లోని 9 డిపోల పరిధిలో 18 కార్గో కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. గతేడాది రీజియన్‌ పరిధిలో 10,693 మంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా సంస్థకు రూ.8,55,440 ఆదాయం సమాకూరింది. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో మెదక్‌ రీజియన్‌ మూడో స్థానంలో నిలిచింది.

కార్గో కేంద్రాలు..

మెదక్‌ రీజియన్‌ పరిధిలో మెదక్‌తో పాటు రామాయంపేట, చేగుంట నర్సాపూర్‌, సంగారెడ్డి, జోగిపేట, సదాశివపేట, నారాయణఖేడ్‌, శంకరంపేట, జహీరాబాద్‌, సిద్దిపేట పట్టణంలో 2, చేర్యాల, గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌, తూప్రాన్‌, దుబ్బాక, హుస్నాబాద్‌ ప్రాంతాల్లో కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.

తపాలా శాఖ ఆధ్వర్యంలో..

తపాలా శాఖ సైతం ఇంటికే తలంబ్రాలు అందించే ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు ఈ నెల 29 వరకు సమీపాన తపాలా కార్యాలయాల్లో కల్యాణ తలంబ్రాలకు రూ.450, ముత్యాల తలంబ్రాలకు రూ.150 చెల్లించి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని మెదక్‌ ప్రధాన తపాలా కార్యాలయ పర్యవేక్షకుడు డి.శ్రీహరి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని