logo

ఏడుపాయల అర్చకుడికి ఉగాది పురస్కారం

ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో అర్చకుడిగా విధులు నిర్వహించే రావికోటి పార్థివశర్మకు ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని అందజేసింది

Published : 23 Mar 2023 01:11 IST

మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి నుంచి పురస్కారం అందుకుంటున్న పార్థివశర్మ

పాపన్నపేట, న్యూస్‌టుడే: ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో అర్చకుడిగా విధులు నిర్వహించే రావికోటి పార్థివశర్మకు ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని అందజేసింది. బుధవారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పురస్కారాన్ని అందజేశారు. కొడుపాకకు చెందిన ఆయన 2008నుంచి వనదుర్గా ఆలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాలకమండలి ఛైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో శ్రీనివాస్‌, ఆలయ సిబ్బంది, అర్చకులు ఆయనను అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు