logo

పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దు

పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురి కావద్దని, ఆత్మవిశ్వాసంతో పదో తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు

Updated : 23 Mar 2023 05:28 IST

హబ్షీపూర్‌ బీసీ గురుకులంలో విద్యార్థులతో కలిసి నిద్రిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాక: పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురి కావద్దని, ఆత్మవిశ్వాసంతో పదో తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం రాత్రి మండలంలోని హబ్షీపూర్‌ శివారులో మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన బాలుర సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి, రాత్రి విద్యార్థులతో వసతి గృహంలోనే ఎమ్మెల్యే నిద్రించారు. అనంతరం బుధవారం ఉదయం పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన స్టడీ అవర్‌లో పాల్గొని, సందేహాలను నివృత్తి చేశారు. వసతిగృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని