logo

మొక్కజొన్న ధర ఆశాజనకం

జిల్లా వ్యాప్తంగా 3,039 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఉత్పత్తులు చేతికి వస్తుండటంతో ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.1,962గా ప్రకటించింది.

Published : 23 Mar 2023 01:26 IST

న్యూస్‌టుడే, చేగుంట

జిల్లా వ్యాప్తంగా 3,039 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఉత్పత్తులు చేతికి వస్తుండటంతో ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.1,962గా ప్రకటించింది. బహిరంగ మార్కెట్‌లో రూ.2,200 పలుకుతోంది. ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దాణా పరిశ్రమల్లో విక్రయిస్తే క్వింటాకు రూ.2,400 వరకు ఉంది. రైతులు మొక్కజొన్న జూళ్లు తీసి, పలు చోట్ల రహదారులపై, పొలం వద్ద ఎండబెడుతున్నారు. ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని పేర్కొంటున్నారు. చేగుంట మండలం కర్నాల్‌పల్లి, బోనాల, మక్కరాజుపేట, చందాయిపేట, ఇబ్రహీంపూర్‌, బి.కొండాపూర్‌, చిన్నశివునూర్‌ తదితర గ్రామాల్లో మొక్కజొన్న అధికంగా సాగు చేశారు. రెండేళ్ల క్రితం వరకు యాసంగిలో తక్కువగా సాగయ్యేది. గతేడాది నుంచి మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. ఉత్పత్తులను కొనుగోలు చేసిన వ్యాపారులు ఫౌల్ట్రీలకు అమ్ముతున్నారు. గతంలో వానాకాలంలో చాలా మంది రైతులు మొక్కజొన్న సాగుచేసేవారు.  ప్రస్తుతం నీటి వనరులు ఎక్కువగా ఉండటంవల్ల వరి వైపు మొగ్గుచూపడంతో వీటి కొరత ఏర్పడింది. అందువల్ల వాటి ధర పెరుగుతూ వస్తోంది. దీంతో యాసంగిలో మొగ్గు చూపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని