logo

అసలు దోషులను గుర్తించే వరకు పోరాటం: భాజపా

టీఎస్‌పీఎస్సీ పశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అసలు దోషులను గుర్తించే వరకు భాజపా పోరాటం చేస్తుందని, ఈ నెల 25న హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ నేతృత్వంలో‘మా నౌకరీలు మాగ్గావాలే’ నినాదంతో మహాధర్నా చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ చెప్పారు.

Published : 24 Mar 2023 01:14 IST

సమావేశంలో మాట్లాడుతున్న భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌

మెదక్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ పశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అసలు దోషులను గుర్తించే వరకు భాజపా పోరాటం చేస్తుందని, ఈ నెల 25న హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ నేతృత్వంలో‘మా నౌకరీలు మాగ్గావాలే’ నినాదంతో మహాధర్నా చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ చెప్పారు. గురువారం మెదక్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోర్డుపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వం బాధ్యత వహించి ఉద్యోగార్థులకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌, అసెంబ్లీ కన్వీనర్‌ మధు, సీనియర్‌ నాయకులు రాజశేఖర్‌, రఘువీరారెడ్డి, పట్టణాధ్యక్షుడు ప్రసాద్‌, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌

మెదక్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంగయ్య, వెంకట్‌రామ్‌రెడ్డి, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ యాదగిరి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఉన్న బోర్డును రద్దు చేసి అర్హులైన వారిని నియమించాలన్నారు. నష్టపోయిన విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

నేడు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

ఉపాధ్యాయుల, ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులను మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేయనున్నట్లు యూపీఎస్సీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సంగయ్య, వెంకట్‌రామ్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, పద్మారావు ఒక ప్రకటనలో తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు