logo

వివాద భూముల పరిష్కారానికి చర్యలు

లబ్ధిదారులకు ఇచ్చిన అసైన్డ్‌ భూమి, ధరణి రికార్డులో నమోదై పెండింగ్‌లో ఉన్న వాటికి డిజిటల్‌ సంతకం చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా ఆదేశించారు.

Published : 24 Mar 2023 01:11 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజర్షిషా, చిత్రంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, అదనపు పాలనాధికారి రమేశ్‌

మెదక్‌, న్యూస్‌టుడే: లబ్ధిదారులకు ఇచ్చిన అసైన్డ్‌ భూమి, ధరణి రికార్డులో నమోదై పెండింగ్‌లో ఉన్న వాటికి డిజిటల్‌ సంతకం చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూముల పరిష్కారంపై ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన సమీక్షించారు. చిన్నశంకరంపేట మండలం సురారం, ఎస్‌.కొండాపూర్‌, టి.మందాపూర్‌, గజగట్లపల్లిలో వివిధ సర్వే నంబర్లను సరిచూడాలని చెప్పారు. అనంతరం ఆయన సీఎంఆర్‌పై సమీక్షించారు. 2021-22 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 13,700 టన్నుల ధాన్యాన్ని కస్టం మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి ఇవ్వాలని సూచించారు.

కోతుల బెడద నివారణకు చర్యలు

జిల్లాల్లో కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. 500 ఎకరాల్లో పండ్ల మొక్కలు పెంచేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. రహదారులపై ఆహారం వేసే వారికి జరిమానా విధించాలని సూచించారు. నర్సాపూర్‌, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల వద్ద చెక్‌పోస్టుల నుంచి కోతుల, శునకాల రవాణా జరగకుండా నిఘాపెట్టాలన్నారు.

ఆర్థికసాయం అందజేత

కొల్చారం మండలం రంగంపేటలో గత జూన్‌ 28న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థులు జశ్వంత్‌, రజనీకాంత్‌ కుటుంబాలకు, గాయపడిన రాంచరణ్‌కు రూ.2.లక్షల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, పాలనాధికారి అందించారు. ఆయా సమావేశాల్లో అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్‌, రమేశ్‌, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రపాల్‌, జిల్లా అధికారులు శ్రీనివాస్‌, రవిప్రసాద్‌, శశికుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని