logo

చెట్లు మాయమైపోతున్నాయి!

ప్రధాన రహదారులపై వృక్షాలను విస్తరణ పేరుతో కొట్టేస్తున్నారు. మరోచోట హరితహారం మొక్కల సంరక్షణ చేపట్టాల్సినా ఉన్నా చర్యలు తీసుకోవడం లేదు.

Published : 24 Mar 2023 01:11 IST

నాగారం రోడ్డులో చెట్ల దుస్థితి

కొండపాక గ్రామీణం, కొండపాక, హుస్నాబాద్‌: ప్రధాన రహదారులపై వృక్షాలను విస్తరణ పేరుతో కొట్టేస్తున్నారు. మరోచోట హరితహారం మొక్కల సంరక్షణ చేపట్టాల్సినా ఉన్నా చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు మిన్నకుండి పోతున్నారు. కొండపాక, కుకునూరుపల్లి మండలాల మీదుగా వెళ్లే రాజీవ్‌ రహదారికి ఇరువైపులా మూడు వరుసల్లో వేలాది మొక్కలున్నాయి. ఎవరో వాటికి మంట పెట్టడంతో వరుసగా కాలిపోయాయి. కొండపాక, తిమ్మారెడ్డిపల్లి, లకుడారం శివారులో కొన్ని ఎండిపోయి, మరికొన్ని కాలిపోయాయి.

* కొండపాక మండలం మర్పడ్గ శివారులోని దుద్డెడ దారిలో భారీగా పెరిగిన అల్లనేరేడు చెట్లను నరికేశారు. కాండం ఎత్తుకెళ్లి కొమ్మలను వదిలేశారు.

* హుస్నాబాద్‌ పట్టణంలో విద్యుత్తు తీగలకు అడ్డొస్తున్నాయని నరికేశారు. నాగారం, అక్కన్నపేట రోడ్లలో ఈ పరిస్థితి ఉంది. విద్యుత్తు, పురపాలిక, ఉద్యాన శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రజాధనం ఖర్చయిన హరితహారం చెట్లు నరికివేతకు గురవుతున్నాయి.

లకుడారంలో కాలిపోయిన మొక్కలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని