logo

మహిళలకు ప్రతి మంగళవారం ఆరోగ్య పరీక్షలు

జిల్లాలోని ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ప్రతి మంగళవారం పరీక్షలు నిర్వహిస్తామని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి శరత్‌ కోరారు.

Published : 24 Mar 2023 01:11 IST

మాట్లాడుతున్న పాలనాధికారి శరత్‌, చిత్రంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ప్రతి మంగళవారం పరీక్షలు నిర్వహిస్తామని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి శరత్‌ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్యారోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఝరాసంగం, కోహీర్‌ మండలం బీలాల్‌పూర్‌, జిన్నారం, రామచంద్రాపురంలోని ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఎనిమిది రకాలుగా పరీక్షలు చేస్తామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి, వైద్యాధికారులు శశాంక్‌ దేశ్‌పాండే, రాజేశ్వరి పాల్గొన్నారు.

పంట నష్టం వివరాలు సిద్ధం చేయండి

జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం వివరాలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్‌ శాఖలపై సమీక్ష చేశారు. ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్‌), ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రహదారుల ప్రగతి, పది పరీక్షలు తదితర అంశాలపై ఆరా తీశారు. పనుల వేగవంతానికి ఆదేశించారు.

రుణాల పంపిణీకి బ్యాంకర్లు సహకరించాలి

సంగారెడ్డి మున్సిపాలిటీ: వివిధ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు రుణాలు అందించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని జిల్లా పాలనాధికారి డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. గురువారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా వివిధ పథకాలలో అందిస్తున్న యూనిట్లకు సంబంధించి ఎలాంటి పెండింగ్‌ లేకుండా ఈ నెల 31లోగా రుణ లక్ష్యాన్ని చేరుకోవాలని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని