పవిత్ర మాసం.. సర్వశుభాల సమాహారం
పవిత్ర రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇది సర్వశుభాల సమాహారం. పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో అల్లా ఆజ్ఞలను అనుసరించి మహ్మద్ ప్రవక్త ప్రబోధాలు ముస్లింలు తూచా తప్పకుండా ఆచరిస్తారు.
నేటి నుంచి రంజాన్ ప్రారంభం
పవిత్ర రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇది సర్వశుభాల సమాహారం. పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో అల్లా ఆజ్ఞలను అనుసరించి మహ్మద్ ప్రవక్త ప్రబోధాలు ముస్లింలు తూచా తప్పకుండా ఆచరిస్తారు. మంచిని పెంచేందుకు, చెడు రూపుమాపడానికి అల్లా దివ్య సందేశాలిచ్చారు. పర్వదినాల్లో ఫిత్రా (దానాలు) చేస్తారు. నెల రోజుల పాటు నిత్యం సహర్ (తెల్లవారుజామున భోజనం), ఇఫ్తార్ (సూర్యాస్తమయం సమయంలో దీక్ష విరమణ) ఆచరిస్తారు.
రోజా: రోజాను ‘సౌమ్’, ‘సియామ్’ అని పిలుస్తారు. రోజా దీక్షాదారుడిని సాయమ్ అంటారు. రోజా అంటే ప్రభాత పూర్వసమయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలు త్యజించడం, లైంగిక వాంఛలను అదుపులో ఉంచుకోవడం అని అర్థం.
రంజాన్: అరబిక్ భాషలో ‘రమ్జ్’ అంటే కాలడం అని అర్థం. ఉపవాస దీక్షతో శరీరాన్ని శుష్కింప చేయడంతో ఆత్మలోని మలినాలు ప్రక్షాళనమై సర్వపాపాలు దహించుకుపోతాయి.
మూడు భాగాలు: మహ్మద్ ప్రవక్త రంజాన్ మాసాన్ని మూడు భాగాలుగా విభజించారు. తొలి అంకం పది రోజులు దైవ కృపాకటాక్షాలకు, రెండో పది రోజులు దైవ క్షమాపణలకు, చివరగా నరకం నుంచి విముక్తి కలిగించి సాఫల్యం పొందేందుకు నిర్దేశించారు.
సర్వం సిద్ధం
రంజాన్‌ను పురస్కరించుకొని ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో రోజా పాటించడం, ఖురాన్ పఠనం, తరావీ నమాజ్ ఆచరించేందుకు మసీదుల్లో సర్వం సిద్ధం చేశారు. సుందరంగా తీర్చిదిద్దారు. పలు చోట్ల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. తరావీ నమాజ్ చదివేందుకు హఫేజ్-ఏ-ఖురాన్ (ఖురాన్ కంఠస్థం చేసిన గురువులు)లను సైతం నియమించారు. బిహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వారిని పిలిపించారు.
న్యూస్‌టుడే, వెల్దుర్తి, బొంరాస్‌పేట
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు
-
General News
KTR: ఈ-గవర్నెన్స్‌లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్: మంత్రి కేటీఆర్
-
Politics News
Amit Shah- Rahul Gandhi: రాహుల్.. మీ పూర్వీకుల నుంచైనా నేర్చుకోండి: అమిత్ షా
-
Sports News
Wrestlers: అలాగైతేనే ఏషియన్ గేమ్స్‌కు వెళ్తాం.. రెజ్లర్ల అల్టిమేటం
-
Crime News
Apsara Murder Case: ‘మనిషిని చంపడం ఎలా?’.. ఇంటర్నెట్లో శోధించి పథకం ప్రకారమే హత్య
-
Sports News
WTC Final : అసలేం జరుగుతోంది..? సిరాజ్‌పై గావస్కర్ అసహనం..