logo

వైద్యారోగ్యశాఖలో బదిలీలపై ఇంటెలిజెన్స్‌ విభాగం ఆరా

జిల్లా వైద్యారోగ్యశాఖలో బదిలీలు, డిప్యూటేషన్లు, ఉద్యోగాల భర్తీల విషయంలో అవినీతి తీరును ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది.

Published : 24 Mar 2023 01:11 IST

సంగారెడ్డి అర్బన్‌: జిల్లా వైద్యారోగ్యశాఖలో బదిలీలు, డిప్యూటేషన్లు, ఉద్యోగాల భర్తీల విషయంలో అవినీతి తీరును ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నెల 23న ‘చేయి తడిపితే.. కోరుకున్న చోట పోస్టింగ్‌’ శీర్షికన ఇచ్చిన కథనానికి ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు స్పందించారు. ఆ కార్యాలయంలో అవకÛతవకలపై వివరాలు సేకరిస్తున్నారు. జీవో 317కు వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యోగం చేయడం సరికాదని.. సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆ విభాగం పోలీసులు ‘న్యూస్‌టుడే’కు వివరించారు. సీనియర్‌ సహాయకుల వ్యవహారం తీరుకు నిరసనగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఉద్యోగ సంఘం నాయకులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని