logo

రుణ యాప్‌ నిర్వాహకుల వేధింపులు.. ఆత్మహత్యాయత్నం

సిద్దిపేట టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ ఫ్యూచర్‌, సన్నీ, లోన్‌ స్టోర్‌, స్మార్ట్‌ వాలెట్‌ నుంచి రుణం తీసుకొని ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు.

Published : 24 Mar 2023 01:11 IST

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: సిద్దిపేట టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ ఫ్యూచర్‌, సన్నీ, లోన్‌ స్టోర్‌, స్మార్ట్‌ వాలెట్‌ నుంచి రుణం తీసుకొని ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. ఇటీవల ఆమె సోదరి చిత్రాలను సేకరించి అసభ్యంగా చిత్రీకరించి ఆమెను, కుటుంబ సభ్యులను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. బాధితురాలి సోదరి గత వారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం 1930కి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. హుస్నాబాద్‌లో ఓ యువతి వాట్సాప్‌ నెంబరును హ్యాక్‌ చేశారు. యువతి అడిగినట్టుగా ఆమె స్నేహితులను డబ్బు పంపించమన్నారు. వారిలో ఒకరు నమ్మి రూ.3000 పంపించాడు. మరిన్ని డబ్బులు కావాలని మెసేజీ రావడంతో హ్యాక్‌ అయిందని తెలుసుకున్నారు. ఇండియన్‌ పేమెంట్‌ బ్యాంక్‌ అనే పేరు చెప్పి.. ఓటీపీ తెప్పించుకొని ఓ బాధితుడి ఖాతా నుంచి రూ.7 వేలు సైబర్‌ నిందితులు లాగేసుకున్నారు. కుకునూరుపల్లిలోనూ ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.6 వేలు డెబిట్‌ అయ్యాయి. వీరు 1930 నంబరుకు ఫిర్యాదు చేశారు. సైబర్‌ మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని