logo

నైపుణ్యంతో విజయం తథ్యం

నైపుణ్యాలు ఉంటే విజయం సాధించడం తథ్యమని తెలంగాణ ఛాంబర్స్‌ ఉమెన్‌ వింగ్‌ అధ్యక్షురాలు భగవతి దేవి సూచించారు.

Published : 29 Mar 2023 02:12 IST

తెలంగాణ ఛాంబర్స్‌ ఉమెన్‌ వింగ్‌ అధ్యక్షురాలు భగవతి దేవి

సమావేశంలో పాల్గొన్న భగవతిదేవి తదితరులు

మెదక్‌ టౌన్‌: నైపుణ్యాలు ఉంటే విజయం సాధించడం తథ్యమని తెలంగాణ ఛాంబర్స్‌ ఉమెన్‌ వింగ్‌ అధ్యక్షురాలు భగవతి దేవి సూచించారు. మంగళవారం మెదక్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫెడరేషన్‌ ఛాంబర్‌్ అండ్‌ కామర్స్‌ ఇండస్ట్రీస్‌, వజీర్‌ సుల్తాన్‌ టొబాకో కంపెనీస్‌ సంయుక్తాధ్వర్యంలో రెండు రోజుల ఎంటర్‌ప్రెన్యూర్‌ మెంటర్‌షిప్‌ ప్రోగ్రాం శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురుచూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగేయాలన్నారు. నైపుణ్య సాధనకు కృషి చేయాలని చెప్పారు. వజీర్‌ సుల్తాన్‌ టొబాకో కంపెనీ జనరల్‌ మేనేజర్‌ బిజు జోసెఫ్‌ మాట్లాడుతూ.. స్వయం శక్తితో విద్యార్థులు వ్యాపారాలు ప్రారంభిస్తే అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. ప్రముఖ వక్త, అర్థికవేత్త పల్లం రాజు, వ్యాపారవేత్త మల్లికార్జున్‌ గుప్తాలు స్వయం ఉపాధిలో విజయం సాధించడంపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ గణపతి, నిర్వాహకుడు రాకేష్‌సింగ్‌, అధ్యాపకులు శరత్‌రెడ్డి, శేఖర్‌, దినకర్‌, సుధాకర్‌, హరిత, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సెల్‌ కోఆర్డినేటర్‌ అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని