logo

‘ప్రశ్నపత్రం లీకేజీ కేసును సీబీఐ విచారించాలి’

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లా విభాగ్‌ కన్వీనర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 29 Mar 2023 02:12 IST

మంత్రి క్యాంపు కారాలయం వద్ద ఏబీవీపీ నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లా విభాగ్‌ కన్వీనర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేటలో మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవస్థ మొత్తం తప్పు చేస్తే కేవలం ఇద్దరు వ్యక్తుల వల్ల మాత్రమే లీకేజీ జరిగిందని మంత్రి కేటీఆర్‌ ఏవిధంగా చెప్పారని ప్రశ్నించారు. ఇందులో బీఆర్‌ఎస్‌ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. మంత్రి హరీశ్‌రావు స్పందించక పోవడం సిగ్గుచేటన్నారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకొని పట్టణ ఒకటో ఠాణాకు తరలించారు. సంఘం సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల కన్వీనర్లు వివేక్‌, శశికాంత్‌, ఆకాష్‌, ప్రతినిధులు ఆదిత్య, లక్ష్మీపతి, సంజయ్‌, రాకేష్‌, ప్రశాంత్‌, ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని