logo

ఆర్టీసీ ‘చల్ల’ని కబురు

ఆర్టీసీ నష్టాలను అధిగమించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకు విన్నూత కార్యక్రమాలు చేపడుతోంది. ఈ తరుణంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి సారించింది

Published : 29 Mar 2023 02:12 IST

మెదక్‌ డిపోలో సిబ్బందికి మజ్జిగ పంపిణీ

ఆర్టీసీ నష్టాలను అధిగమించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకు విన్నూత కార్యక్రమాలు చేపడుతోంది. ఈ తరుణంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి సారించింది. మెదక్‌ రీజియన్‌లోని అన్ని డిపోల్లో ఉద్యోగులకు 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. మరో అడుగు ముందుకేసి ఆర్టీసీ ఉద్యోగులకు వేసవిలో మజ్జగ పంపిణీ చేసేందుకు సంస్థ ఏర్పట్లు చేసింది. ఈ మేరకు యాజమాన్యం అన్ని డిపోలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు డిపోల్లో ఈ కేంద్రాలు వెలిశాయి. విధుల్లో ఉండే డ్రైవర్లు, కండక్టర్లకు మధ్యాహ్నం మజ్జిగ అందిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 9, వికారాబాద్‌ జిల్లాలో 3 డిపోలు ఉన్నాయి. వీటిల్లో 2650 మంది వరకు పని చేస్తున్నారు. నిత్యం వారందరికీ మజ్జిగను అందుబాటులో ఉంచుతున్నారు.

ప్రయాణికులకు ప్రత్యేకంగా..

ప్రయాణికులకు తాగునీరు అందించేందుకు వాటర్‌ కూలింగ్‌ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 9 డిపోలకు వాటిని అందించనున్నారు. ప్రయాణ ప్రాంగణాలలో ఏర్పాటుచేయనున్నారు. దీంతో ప్రయాణికులకు చల్లని నీరు అందుబాటులోకి రానుంది. ఏటా బస్టాండ్లలో స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పే చలివేంద్రాలపై ఆధారపడుతుంటారు. ఈసారి ఆర్టీసీ ప్రత్యేకంగా ప్రతి డిపోకు కూలింగ్‌ యాంత్రాలను అందించాలని నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని