logo

నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి

నాలుగేళ్లుగా నర్సాపూర్‌ నియోజకవర్గ ప్రగతికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు.

Published : 30 Mar 2023 02:21 IST

ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

నర్సాపూర్‌: నాలుగేళ్లుగా నర్సాపూర్‌ నియోజకవర్గ ప్రగతికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. ఉపాధి పథకం ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.22 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ.55 కోట్లతో సీసీ రోడ్లను నిర్మించామన్నారు.  ప్రతి పంచాయతీకి రూ.20లక్షల చొప్పున, మండల కేంద్రానికి రూ.కోటి చొప్పున, నర్సాపూర్‌ పురపాలికకు రూ.25కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులను సాధించినట్లు వివరించారు. సీఎం కేసీఆర్‌ సహకారం వల్లే సాధ్యమైందన్నారు. నర్సాపూర్‌ పురపాలికలో టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.4.05 కోట్లతో పనులు కొనసాగుతున్నట్లు వివరించారు. బస్‌డిపో నర్సాపూర్‌లో ఏర్పాటు చేయడం, లాభాల్లో ముందుకు సాగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంజీరా నది, హల్దీవాగులపై 12వరకు చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఈ ఏడాది నర్సాపూర్‌, శివ్వంపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలప్‌చెడ్‌, హత్నూర మండలాల్లోని చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపి లక్ష ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు చెప్పారు. ఇందుకోసం కాళేశ్వరం ప్రధాన కాల్వల నిర్మాణం పనులు వేగంగా కొనసాగిస్తున్నామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు