దర్జీలకు అందని కుట్టు కూలీ
వచ్చే విద్యా సంవత్సరం(2023-24)కు సంబంధించి ఏక రూప దుస్తుల కోసం వస్త్రం వచ్చేసింది. జూన్ 12న పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసేలా విద్యాశాఖ కసరత్తు చేస్తొంది.
ఏడాదిగా ఎదురుచూపులు
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ
వచ్చే విద్యా సంవత్సరం(2023-24)కు సంబంధించి ఏక రూప దుస్తుల కోసం వస్త్రం వచ్చేసింది. జూన్ 12న పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసేలా విద్యాశాఖ కసరత్తు చేస్తొంది. ప్రస్తుత(2022-23) విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎకరూప దుస్తుల ‘కుట్టు’ బకాయిలు ఇప్పటికీ దర్జీలకు చెల్లించలేదు. జిల్లాలో మహిళా సంఘాల సభ్యులు, ఏజెన్సీలకు ప్రతి ఏడాది ఏకరూప దుస్తులు కుట్టించే బాధ్యత అప్పగిస్తున్నారు. ఈ ఏడాది వారికి డబ్బులు చెల్లించకపోవడంతో మళ్లీ బాధ్యత ఎలా అప్పగించాలని ప్రధానోపాధ్యాయులు మదన పడుతున్నారు. బకాయిలు చెల్లించకుంటే నిర్వాహకులు ముందుకు రాకపోవచ్చని అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కథనం.
రూ.98.76 లక్షల బకాయిలు
జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యాశాఖ ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు అందిస్తోంది. ఇందుకు అవసరమైన వస్త్రాన్ని టెస్కో ద్వారా విద్యాశాఖ కొనుగోలు చేసి పాఠశాలలకు పంపిణీ చేస్తోంది. పాఠశాల యాజమాన్య కమిటీ తీర్మానం మేరకు కుట్టించి విద్యార్థులకు అందజేస్తారు. జిల్లాలో 1,23,459 మంది విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్సరం రెండు జతల దుస్తులు మహిళా సంఘాల సభ్యులు, దర్జీల వద్ద కుట్టించి విద్యార్థులకు గతేడాది ఆగస్టులో పంపిణీ చేశారు. ఒక్కో జతకు రూ.40 చొప్పున రెండు జతలకు కలిపి రూ.80 కుట్టి కూలీ అందజేయాలి. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన నిధులు విద్యాశాఖ విడుదల చేయలేదు. రూ.98.76 లక్షల బకాయిలు పేరుకుపోయాయి.
మండలాలకు చేరనున్న కొత్త వస్త్రం
విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన వస్త్రం మరో నాలుగైదు రోజుల్లో మండల కేంద్రాలకు చేరనుంది. మండల విద్యాధికారులు ఆ వస్త్రాన్ని పాఠశాలలకు పంపించాలి. మహిళా సంఘాల సభ్యులు, దర్జీలతో కుట్టించి జూన్ మొదటి వారం వరకు పాఠశాలలకు అందించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాత బకాయిలే చెల్లించలేదని.. కొత్తది ఎలా కుట్టించాలని ప్రధానోపాద్యాయులు చెబుతున్నారు.
నాలుగైదు రోజుల్లో విడుదల
ఏకరూప దుస్తులకు సంబంధించిన కుట్టు కూలీ నిధులు విడుదల చేయాలని ప్రధానోపాధ్యాయులు కోరారు. తాము కూడా ఉన్నతాధికారులకు విన్నవించాం. నాలుగైదు రోజుల్లో ఈ నిధులు నేరుగా పాఠశాలల ఖాతాలో జమయ్యే అవకాశం ఉంది. - వెంకటేశం, సెక్టోరియల్ అధికారి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన.. కేంద్రమంత్రి అర్ధరాత్రి ట్వీట్
-
Movies News
father characters: తండ్రులుగా జీవించి.. ప్రేక్షకుల మదిలో నిలిచి!
-
Politics News
YVB Rajendra Prasad: తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Ponguleti: విజయనగరం సీనరేజి టెండరూ ‘పొంగులేటి’ సంస్థకే
-
Crime News
పెళ్లై నెల కాకముందే భర్త మృతి.. కొత్త జంటను వేరుచేసిన రైలు ప్రమాదం