తగ్గిన కొనుగోలు.. కానరాని కాసులు
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)ల గల్లాపెట్టెలు నిండటం లేదు. రెండేళ్లుగా ఆదాయం అంతంత మాత్రమే వచ్చింది.
మార్కెట్ కమిటీల్లో ఇదీ తీరు
గజ్వేల్ మార్కెట్‌యార్డు
న్యూస్‌టుడే, గజ్వేల్: జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)ల గల్లాపెట్టెలు నిండటం లేదు. రెండేళ్లుగా ఆదాయం అంతంత మాత్రమే వచ్చింది. పంటల దిగుబడి పడిపోవడం, కొందరు ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి పంటల విక్రయించుకోవటం కారణంగా ఆదాయం రావటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది కూడా లక్ష్యం నెరవేరలేదు. పంటలను కొనుగోలు చేసే కేంద్రాలు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు కొనుగోళ్ల మొత్తంలో చెల్లించే 1 శాతం ఫీజును మార్కెట్లు తమ ఆదాయంగా పరిగణించుకుని ఆ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాల పరిధిలో వివిధ అభవృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటారు. గ్రామాల్లో అనుసంధాన రోడ్లు, పశువైద్య శిబిరాలు, మార్కెట్‌యార్డుల్లో వసతుల కల్పన, షెడ్లు, రైతులకు సౌకర్యాలు కల్పిస్తుంటారు. జిల్లాలో మొత్తం 14 మార్కెట్ కమిటీలున్నాయి. 1.50 లక్షల మంది ఏటా రెండు సీజన్లు కలిపి 8.10 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ప్రైవేటు వ్యాపారులు ఉత్పత్తులు కొనుగోలు చేసి ప్రభుత్వానికి సెస్సు చెల్లిస్తుంటారు. గత వానాకాలం సీజన్‌లో ప్రకృతి సహకరించక పంటల దెబ్బతిన్నాయి. దిగుబడి పడిపోయింది. ఎకరాకు 15 క్వింటాళ్లు రావాల్సిన పత్తి మూడు నుంచి ఐదు క్వింటాళ్లకు తగ్గింది. ధాన్యం, మొక్కజొన్నలు, ఇతర పప్పుదినుసు పంటల దిగుబడి రాలేదు. ఈ సారి పత్తికి బహిరంగ మార్కెట్‌లో అధిక ధర లభించటంతో సీసీఐ కొనుగోళ్లు నామమాత్రంగా మారాయి. పంటల ఉత్పత్తి పడిపోవటంతో కొనుగోళ్లు లేక మార్కెట్‌కు రావాల్సిన ఆదాయం సరిగా రాకుండాపోయింది. దీంతో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై ప్రతికూలత నెలకొంది. ఈ సందర్భంలో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. బకాయిలు వసూలు చేసి ఈ ఏడాది లక్ష్యాన్ని చేరుకుంటామని జిల్లా ఏడీఎం రియాజ్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Elon Musk: మస్క్ తనయుడికి సందేహం.. దిల్లీ పోలీసుల రిప్లయ్!
-
India News
Wrestlers protest: బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే.. లేదంటే..: రాకేశ్ టికాయత్ హెచ్చరిక
-
General News
Viveka Murder case: సునీత పిటిషన్‌పై విచారణ ఈనెల 5కి వాయిదా
-
General News
Ts News: దిల్లీలోని తెలంగాణ భవన్లో యువతి ఆత్మహత్యాయత్నం
-
Movies News
Raveena Tandon: సూపర్‌హిట్ రెయిన్ సాంగ్.. అక్షయ్ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్
-
India News
Manish Sisodia: సిసోదియాకు స్వల్ప ఊరట.. భార్యను చూసొచ్చేందుకు అనుమతి