logo

లింగవివక్ష రహిత సమాజమే లక్ష్యం

మహిళలకు అన్నింటా సమానత్వం దక్కాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్‌లో ఐసీడీఎస్‌, మహిళా కమిషన్‌, ఏఆర్‌ఈఎస్‌ సంస్థల ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ...

Published : 30 Mar 2023 02:36 IST

మాట్లాడుతున్న సునీతారెడ్డి, జిల్లా అదనపు పాలనాధికారిణి ప్రతిమాసింగ్‌, తదితరులు

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: మహిళలకు అన్నింటా సమానత్వం దక్కాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్‌లో ఐసీడీఎస్‌, మహిళా కమిషన్‌, ఏఆర్‌ఈఎస్‌ సంస్థల ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు  ధ్రువీకరణ పత్రాల ప్రదానోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బుధవారం ఆమె మాట్లాడారు. లింగవివక్ష లేని సమాజం ఏర్పాటు జరగాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సి ఉందన్నారు. బాల్యవివాహాలు, వివక్ష, సమానత్వం తదితర సమస్యలపై ఏఈఆర్‌ఎస్‌ నియోజకవర్గంలోని 50 గ్రామాలను ఎంపిక చేసి, మార్పునకు చేస్తున్న కృషిని అభినందించారు. జిల్లా అదనపు పాలనాధికారిణి ప్రతిమాసింగ్‌ మాట్లాడుతూ మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు భయపడవద్దని ధైర్యంగా ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖల రాష్ట్ర కార్యదర్శి కృష్ణవేణి, వరంగల్‌ ఆర్‌జేడీ ఝాన్సి, జిల్లా అధికారిణి బ్రహ్మాజీ, సీడీపీవో హేమాభార్గవి, ఏఈఆర్‌ఈఎస్‌ ప్రతినిధి కొర్రపాటి సునీత, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్‌ రూపొందించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. మహ్మదాబాద్‌ కస్తూర్బాగాంధీ విద్యాలయం విద్యార్థినులు ప్రదర్శించిన కళాప్రదర్శన అలరించింది. చిరుధాన్యాలతో తయారుచేసిన పౌష్టికాహారంపై స్టాల్‌ను ఏర్పాటు ఏశారు.

మాతా శిశు సంరక్షణకు కావాల్సిన చిరుధాన్యాలు

చిరుధాన్యాల ఆకృతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని