‘మంగళ’కరం.. మనోధైర్యం
జీవనశైలిలో మార్పులు... ఆహారపు అలవాట్లు... ఒత్తిడి, ఆందోళనలతో ఇటీవల ఎక్కువ మంది మహిళలు హార్మోన్ అసమతుల్యత (పీసీవోఎస్), థైరాయిడ్ సమస్యల బారిన పడుతున్నారు.
మహిళా క్లినిక్‌లకు స్పందన
అల్లాదుర్గంలో పరీక్షలకు వచ్చిన మహిళలు
న్యూస్‌టుడే, మెదక్: జీవనశైలిలో మార్పులు... ఆహారపు అలవాట్లు... ఒత్తిడి, ఆందోళనలతో ఇటీవల ఎక్కువ మంది మహిళలు హార్మోన్ అసమతుల్యత (పీసీవోఎస్), థైరాయిడ్ సమస్యల బారిన పడుతున్నారు. సహజ ప్రక్రియ అయిన మెనోపాజ్‌తో సతమతమవుతున్నారు. పలువురు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇవి నాలుగు వారాల్లో అతివలకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో తేలిన అంశాలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లాకు, అక్కడా సదుపాయాలు లేకపోతే హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. ఆసుపత్రులకు వచ్చిన వారికి ఔషధాలను అందజేస్తున్నారు. అవసరమైన వారికి ల్యాబ్ పరీక్షలు చేస్తున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, టేక్మాల్, శివ్వంపేట, మనోహరాబాద్, వెల్దుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ)ను ఎంపిక చేశారు. ప్రతి మంగళవారం ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళా వైద్య, ఆరోగ్య సిబ్బంది పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స మందుల పంపిణీతో పాటు అనుశీలన చేస్తున్నారు. అన్ని వయస్సుల స్త్రీలకు 8 రకాల సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. రోగనిర్ధారణ, క్యాన్సర్/ ఇతర రోగాల స్క్రీనింగ్, సూక్ష్మ పోషక లోపాల గుర్తింపు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, హార్మోన్ అసమతుల్యతలు (పీసీవోఎస్), మెనోపాజ్ నిర్వహణ, లైంగిక వ్యాధుల నివారణ, శరీర బరువు వంటి అంశాలను ఆరోగ్య కార్డులో నమోదు చేస్తున్నారు.
మెనోపాజ్, పీసీవోఎస్‌తో....
జిల్లాలోని ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గత నాలుగు వారాల్లో 40 ఏళ్లలోపు వారు 606 మందికి, 40 ఏళ్లపైబడిన వారు 751 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఎక్కువ మంది మెనోపాజ్, పీసీవోఎస్‌తో సతమతమవుతున్నారు. మరో వైపు వివిధ రకాల క్యాన్సర్‌లతో 11 మంది బాధపడుతున్నారు. పరీక్షలు చేసుకున్న 1,357 మందిలో 372 మందికి రక్తహీనత సాధారణ స్థితిలో ఉండగా, 510 మందికి తేలికపాటిగా, 463 మందికి మోస్తరు, 12 మందికి తీవ్రంగా ఉంది.
అత్యవసర కేసులు సిఫార్సు
ఆయా పీహెచ్‌సీల్లో పరీక్షలు నిర్వహించిన అనంతరం వ్యాధి తీవ్రత ప్రకారం పలువురిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ఆరు పీహెచ్‌సీల నుంచి 66 మందిని మెదక్‌లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఇక్కడా వారికి తిరిగి పరీక్షలు నిర్వహించి అవసరమైన ఔషధాలు అందజేయనున్నారు. లేదంటే చికిత్స అందిస్తారు. జిల్లా ఆసుపత్రి నుంచి ఇద్దరిని గాంధీకి పంపించారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 366 మందికి ఔషధాలను అందజేయగా, వారి రుగ్మతలను బట్టి 228 మందికి ల్యాబ్ పరీక్షలు చేశారు. ఆయా పీహెచ్‌సీల్లో వైద్యులు మహిళలకు తగిన సూచనలు. సలహాలు అందిస్తున్నారు.
క్రమేణా పెరుగుతున్నారు: చందునాయక్, జిల్లా వైద్యాధికారి
ఆరోగ్య మహిళా ఆసుపత్రుల్లో ఓపీ క్రమేణా పెరుగుతోంది. ఉచితంగా వ్యాధి నిర్ధారణ, నివారణ సేవలు అందిస్తుండటంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించి, వ్యాధి తీవ్రతను బట్టి జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నాం. ఆయా రుగ్మతలతో బాధపడే వారికి వైద్య చికిత్స అందించడం, ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిపై అనుశీలన చేయాలని సిబ్బందికి సూచించాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
విజయనగరం సీనరేజి టెండరూ ‘పొంగులేటి’ సంస్థకే
-
Crime News
పెళ్లై నెల కాకముందే భర్త మృతి.. కొత్త జంటను వేరుచేసిన రైలు ప్రమాదం
-
Ap-top-news News
లింగమనేని రమేష్ ఇల్లు జప్తుపై నిర్ణయానికి అనిశా కోర్టు నిరాకరణ
-
Crime News
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని యువకుడికి నోటీసు.. మఫ్టీలో పులివెందుల పోలీసులు
-
India News
Secunderabad-Agartala Express: సికింద్రాబాద్ - అగర్తలా రైలులో షార్ట్ సర్క్యూట్
-
Ap-top-news News
Viveka Murder Case: ‘భాస్కరరెడ్డి బయట ఉంటే సాక్షులెవరూ ముందుకు రారు’