logo

దుద్దెడకు రైలు ప్రయోగ పరుగు

మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైనులో భాగంగా రెండో విడత కొడకండ్ల-దుద్దెడ రైల్వే లైను పూర్తయింది. 65 కి.మీ. మేర పూర్తయింది.

Published : 01 Apr 2023 01:41 IST

రైల్వేస్టేషన్‌లో ఆగిన రైలు

మనోహరాబాద్‌, గజ్వేల్‌, కొండపాక గ్రామీణ: మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైనులో భాగంగా రెండో విడత కొడకండ్ల-దుద్దెడ రైల్వే లైను పూర్తయింది. 65 కి.మీ. మేర పూర్తయింది. దీనిని శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే ముఖ్య భద్రత అధికారి ప్రంజీవ్‌ సక్సేనా పరిశీలించారు. రైలు ప్రయోగ పరుగుకు ఆమోద ముద్ర వేశారు. అధికారులతో కూడిన ప్రత్యేక రైలు ఉదయం 8 గంటలకు బయల్దేరి కొడకండ్లకు 9.30కు చేరుకుంది. అక్కడి నుంచి భద్రతా అధికారితో పాటు బృందం ప్రత్యేక రైలు ట్రాలీలో కొడకండ్ల నుంచి దుద్దెడ వరకు వంతెనలు, లైన్‌ పనులను తనిఖీ చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు చేరుకున్నారు. దుద్దెడ నుంచి గంటకు 125 కి.మీ. వేగంతో కొడకండ్లకు 20 నిమిషాల్లో చేరుకుంది. రైల్వే లైను పూర్తయినట్లు త్వరలో ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్ల రాకపోకలు సాగించనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ డివిజనల్‌ మేనేజర్‌ శరత్‌ చంద్రాయన్‌, రైల్వే ముఖ్య కార్యనిర్వహణ అధికారి నీరజ్‌, చీఫ్‌ మేనేజర్‌ రవి కల్పాండే, ముఖ్య ఇంజనీర్‌ జనార్దన్‌ తదితరులున్నారు.

పరిశీలిస్తున్న అధికారుల బృందం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని