logo

భాజపా వైఫల్యాలను ప్రశ్నిస్తే వేధింపులా: పొన్నాల

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భాజపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు కేంద్రం వేధింపులకు పాల్పడుతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు.

Published : 01 Apr 2023 01:41 IST

మాట్లాడుతున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, చిత్రంలో నిర్మలారెడ్డి, నాయకులు

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భాజపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు కేంద్రం వేధింపులకు పాల్పడుతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కొంత మంది దేశ సంపదను కొల్లాగొట్టారని పార్లమెంటులో ప్రధానిని రాహుల్‌గాంధీ నిలదీయడం తప్పా.. అంటూ ప్రశ్నించారు. భాజపా రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తోందన్నారు. భాజపా తొమ్మిదేళ్ల పాలనలో కులమతాలు, ప్రాంతీయ తత్వం పేరిట విభజన రాజకీయాలు చేస్తున్నట్టు ఆరోపించారు. అనంతరం సంగారెడ్డిలోని రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షురాలు తూర్పు నిర్మలారెడ్డి, సదాశివపేట పురపాలక సంఘం మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు జార్జి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కూన సంతోష్‌కుమార్‌, నాయకులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని