logo

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించం: పాలనాధికారి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని పాలనాధికారి శరత్‌ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

Published : 01 Jun 2023 01:19 IST

జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ శరత్‌

సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని పాలనాధికారి శరత్‌ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిత్యం కనిష్ఠంగా 50 లారీలు కొనుగోలు కేంద్రాలకు పంపాలని సూచించారు. రైస్‌ మిల్లుల వద్ద లారీల్లోని ధాన్యం దింపుకోవడంలో జాప్యం చేస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్లు, రవాణా, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చూడాలన్నారు.

ఉత్సవాలకు ఏర్పాట్లు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పాలనాధికారి శరత్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన తెలంగాణ-దేశానికే అన్న పూర్ణ అనే నినాదం వేడుకల్లో వినిపించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ నరసింహారావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని