logo

దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించాలి: పాలనాధికారి

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జిల్లా అదనపు పాలనాధికారి ముజమ్మిల్‌ ఖాన్‌ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Published : 01 Jun 2023 01:19 IST

ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ముజమ్మిల్‌ ఖాన్‌

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జిల్లా అదనపు పాలనాధికారి ముజమ్మిల్‌ ఖాన్‌ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మైదానంలో వేడుకల గురించి తెలిసేలా ఫ్లెక్సీలు, వీఐపీల కోసం ప్రత్యేకంగా కారిడార్‌ ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు వేడుకలను వీక్షించేలా గ్యాలరీలు ఉండాలన్నారు. మైదానంలో పరేడ్‌, బందోబస్తు, పార్కింగ్‌ లాంటి విషయాలు చూసుకోవాలని అదనపు డీసీపీ మహేందర్‌కు సూచించారు. తాగునీటి సౌకర్యం, ఇతర మౌలిక వసతులు కల్పించాలని తహసీల్దార్‌ విజయ్‌సాగర్‌ను ఆదేశించారు. రంగధాంపల్లి అమరవీరుల స్థూపాన్ని పూలతో ముస్తాబు చేయాలని బల్దియా కమిషనర్‌ సంపత్‌కుమార్‌ను కోరారు. అన్ని శాఖల సమన్వయంతో వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని