పండగలా దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణలో నిర్వహించాలని పాలనాధికారి శరత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ శరత్
సంగారెడ్డి టౌన్, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణలో నిర్వహించాలని పాలనాధికారి శరత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 2 నుంచి 22 వరకు జరిగే ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఊరూరా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. అధికారులు తమకు కేటాయించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ప్రారంభ వేడుకల్లో లోటుపాట్లకు తావివ్వకూడదన్నారు. కార్యక్రమంలో డీఆర్వో నగేశ్, కలెక్టరేట్ ఏవో మహిపాల్, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ మురళీధర్, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయొద్దు: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని పాలనాధికారి శరత్ హెచ్చరించారు. గురువారం స్థానిక పరిపాలన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమకు కేటాయించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు ఎప్పటికప్పుడు దింపుకోవాలన్నారు. ధాన్యం లారీలను ఖాళీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే మిల్లు యజమానులపై చర్యలు తీసుకోవాలని డీఎస్‌వో వనజాతను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్
-
TS News: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. వర్గాల వారీగా ఇదీ లెక్క!
-
Devara: ‘దేవర’.. ఒక్క సంభాషణా కట్ చేయలేం.. పార్ట్ 2 ప్రకటించిన కొరటాల శివ
-
Rahul Gandhi: అమ్మకు రాహుల్ సర్ప్రైజ్ గిఫ్ట్.. ఏమిచ్చారంటే..?
-
Supriya Sule: ‘హనీమూన్’ ముగియక ముందే.. మహా ప్రభుత్వంలో ముసలం?