logo

ఐక్యతతోనే సమస్యల పరిష్కారం

రాష్ట్రంలోని లింగాయత్‌లు ఐకమత్యంగా మెలుగుతూ.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరించుకోవాలని రాష్ట్రీయ బసవదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌పాటిల్‌ పేర్కొన్నారు.

Published : 02 Jun 2023 01:55 IST

ప్రసంగిస్తున్న బసవదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌పాటిల్‌

జహీరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని లింగాయత్‌లు ఐకమత్యంగా మెలుగుతూ.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరించుకోవాలని రాష్ట్రీయ బసవదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌పాటిల్‌ పేర్కొన్నారు. ఈ నెల 4న లింగాయత్‌లు నిర్వహిస్తున్న చలో హైదరాబాద్‌ కార్యక్రమం గోడపత్రికను జహీరాబాద్‌ పట్టణంలోని బసవ మండపంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 70 లింగాయత్‌ సమాజ్‌లను కలిపి లింగాయత్‌ సమన్వయ సమితిగా ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమానికి జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఐదు వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో లింగాయత్‌ సమాజ్‌ జహీరాబాద్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.సుభాష్‌, మాజీ అధ్యక్షుడు మడపతి బస్వరాజ్‌, సంఘం ప్రతినిధులు యశ్వంత్‌రావు, శరణప్ప, శరణయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని