logo

చేప పిల్లల పంపిణీ లక్ష్యం 4.27 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తోంది. ఏటా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందిస్తూ ఉపాధి కల్పిస్తోంది.

Published : 06 Jun 2023 00:58 IST

ఈ నెలాఖరుకు టెండర్లు పూర్తి

గతేడాది కోమటి చెరువులో చేప పిల్లలను వదులుతున్న  మంత్రి హరీశ్‌రావు, నాయకులు, అధికారులు

న్యూస్‌టుడే,  సిద్దిపేట అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తోంది. ఏటా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందిస్తూ ఉపాధి కల్పిస్తోంది. జిల్లాలో మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నారు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటల్లో చేప పిల్లల పంపిణీ చేపట్టేందుకు మత్స్య శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టారు. జిల్లాలో రంగనాయక, కొండపోచమ్మ, కొమురవెల్లి మల్లన్న సాగర్‌ జలాశయాలు... 1637 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో 4.27 కోట్ల చేప పిల్లలను వదలాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు రూ.4.50 కోట్ల వ్యయం అవుతుందని చెప్పారు. 35-40 ఎంఎం పరిమాణం ఉన్న 1.64 కోట్లు, 80-100 పరిమాణం ఉన్న 2.63 కోట్ల పిల్లలను నీటివనరుల్లో వదలనున్నారు. ప్రధానంగా రౌ, బంగారు తీగ, బొచ్చె రకాలను పెంచనున్నారు. 283 మత్స్యకార సంఘాలు ఉండగా వాటిలో మొత్తం 23,500 మంది సభ్యులు ఉన్నారు. గతేడాది 3.92 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేశారు.

ఉత్పత్తి క్షేత్రాల పరిశీలన

ఉచితంగా చేప పిల్లల పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు టెండర్లు పిలిచారు. ఈ నెల 30న టెండర్ల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. అనంతరం చేప పిల్లల ఉత్పత్తి క్షేత్రాలను పరిశీలిస్తారు. అక్కడ విత్తన రకాలు, వాటి పరిమాణం, నాణ్యత బాగుంటే ధర నిర్ణయించి ఒప్పందం చేసుకుంటారు. ప్రక్రియ పూర్తయ్యాక చెరువుల్లో వదులుతారు.

నీటి లభ్యత ఆధారంగా సరఫరా

మూడు ప్రధాన జలాశయాలు, మిగతా చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. టెండరు ప్రక్రియ ప్రారంభించాం. పూర్తి కాగానే చెరువుల్లో నీటి లభ్యత ఆధారంగా ఉచితంగా సరఫరా చేస్తాం.

మల్లేశం, జిల్లా మత్స్యశాఖ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని