logo

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతోందని డీఈవో రాధాకిషన్‌ అన్నారు. సోమవారం శివ్వంపేట మండలం గోమారంలోని నాలుగు ప్రాథమిక పాఠశాలలను ఎంఈవో బుచ్చానాయక్‌తో కలిసి పరిశీలించారు.

Published : 06 Jun 2023 00:58 IST

శివ్వంపేటలో బడిబాట ర్యాలీ

శివ్వంపేట, న్యూస్‌టుడే: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతోందని డీఈవో రాధాకిషన్‌ అన్నారు. సోమవారం శివ్వంపేట మండలం గోమారంలోని నాలుగు ప్రాథమిక పాఠశాలలను ఎంఈవో బుచ్చానాయక్‌తో కలిసి పరిశీలించారు. బడిబాట కార్యక్రమం ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచి కాముని శ్రీనివాస్‌ కుమారుడు ప్రైవేటు పాఠశాల నుంచి గోమారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించగా ప్రవేశం కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలన్నారు. సర్పంచి లావణ్య, మాధవరెడ్డి, ప్రధానోపాధ్యాయులు కిశోర్‌కుమార్‌, సుందరి, రాధ, వీణ, శైలజ తదితరులు పాల్గొన్నారు.

ఇండెంట్‌ అందజేయాలి

మెదక్‌, న్యూస్‌టుడే: ఒకటి నుంచి పదోతరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను దుకాణాల ద్వారా విక్రయించడానికి అవసరమైన ఇండెంట్‌లను ఈ నెల 10లోగా అందించాలని డీఈవో రాధాకిషన్‌ కోరారు. గతంలో అనుమతి పొందిన విక్రయదారులు, జిల్లా విద్యాధికారి ఇచ్చిన ప్రొసిడింగ్స్‌తో పాటు రూ.వేయి డీడీ జతచేయాలన్నారు. గత విద్యాసంవత్సరం ఇచ్చిన పాఠ్యపుస్తకాల్లో మిగిలిన వాటి జాబితాను తరగతుల వారీగా డీఈవో కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని