logo

అత్యంత వేగంగా పారిశ్రామికీకరణ

రాష్ట్రంలో అత్యంత వేగంగా పారిశ్రామికీకరణ జరగడానికి ప్రభుత్వ విధానాలే కారణమని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పాలనాధికారి రాజర్షి షా, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు.

Published : 07 Jun 2023 01:34 IST

మహిళా పారిశ్రామికవేత్తను సత్కరిస్తున్న సునీతారెడ్డి చిత్రంలో పాలనాధికారి రాజర్షిషా, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రతాప్‌రెడ్డి

మనోహరాబాద్‌: రాష్ట్రంలో అత్యంత వేగంగా పారిశ్రామికీకరణ జరగడానికి ప్రభుత్వ విధానాలే కారణమని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పాలనాధికారి రాజర్షి షా, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు. మంగళవారం మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలోని సనోఫీ పరిశ్రమలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారాస ప్రభుత్వం నగరాల్లోని పరిశ్రమలను గ్రామాలకు విస్తరించిందన్నారు. టీఎస్‌ఐఐసీ ద్వారా పారదర్శకంగా భూసేకరణ చేపట్టి కర్మాగారాల ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పిస్తున్నారని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఉమ్మడి జిల్లాలో ఎన్నో పారిశ్రామికవాడలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లాలో 109 పరిశ్రమలకు కొత్తగా అనుమతులు ఇచ్చామన్నారు. యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామాలను దత్తత తీసుకొని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. పారిశ్రామిక రంగం అభివృద్ధిపై చిత్రప్రదర్శనను చూశారు. ప్రగతి నివేదికను విడుదల చేశారు. అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్‌, రమేశ్‌, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, ఎంపీపీ నవనీత, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ చంద్రాగౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని