logo

పర్యావరణ హితం.. పట్టణ ఉద్యానం

పర్యావరణానికి అత్యంత ప్రమాదకారిగా పరిణమించిన ప్లాస్టిక్‌, వ్యర్థాలను కట్టడి చేసి.. ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తోంది నర్సాపూర్‌లోని పట్టణ ఉద్యానం.

Published : 07 Jun 2023 01:34 IST

లోపలికి వెళ్తున్న పర్యాటకులు

పర్యావరణానికి అత్యంత ప్రమాదకారిగా పరిణమించిన ప్లాస్టిక్‌, వ్యర్థాలను కట్టడి చేసి.. ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తోంది నర్సాపూర్‌లోని పట్టణ ఉద్యానం. మెదక్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి(765-డి)పై నర్సాపూర్‌లో సహజ సిద్ధమైన అడవులకు కొత్త అందాలను తీసుకువస్తూ పట్టణ ఉద్యానాన్ని రెండేళ్ల క్రితం నెలకొల్పారు. రూ.20 కోట్ల నిధులు వ్యయం చేసి 582 ఎకరాల్లో ఇనుప కంచె నిర్మాణం చేపట్టారు. పిల్లలు, పెద్దలకు వేర్వేరుగా టికెట్లు నిర్ణయించారు. లోనికి ప్రవేశించే మార్గంలోనే తనిఖీ చేసి ప్లాస్టిక్‌, ఆహార పదార్థాలు, సిగరెట్లు, బీడీలు వంటివి ఉంటే అనుమతించరు. తాగునీటికి ఇచ్చిన ప్రతి ప్లాస్టిక్‌ సీసాను రోజూ లెక్కించి మరీ వెనక్కి తీసుకుంటున్నారు. ఇద్దరు కూలీలను ఏర్పాటు చేసి లోపల ఎక్కడా పర్యావరణానికి హాని కలిగించే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. చెత్తాచెదారం మచ్చుకైనా కనిపించదు. జాతీయ రహదారి పొడవునా అటవీ అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ప్లాస్టిక్‌ ఏరివేత కార్యక్రమం చేపట్టారు. అడవిలో ప్లాస్టిక్‌ వేసిన వారికి జరిమానాలు విధిస్తామని అటవీ క్షేత్రాధికారి అంబర్‌సింగ్‌ తెలిపారు.

చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా..

న్యూస్‌టుడే, నర్సాపూర్‌:

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని