logo

శతమానం భవతి

సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండల పరిధి మోతె గ్రామంలో పప్పుల బాలమ్మకు వందో పుట్టినరోజును కుటుంబ సభ్యులు మంగళవారం నిర్వహించారు.

Published : 07 Jun 2023 01:34 IST

మోతెలో కుటుంబ సభ్యుల మధ్య వందేళ్ల బాలమ్మ పుట్టినరోజు వేడుక

మిరుదొడ్డి, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండల పరిధి మోతె గ్రామంలో పప్పుల బాలమ్మకు వందో పుట్టినరోజును కుటుంబ సభ్యులు మంగళవారం నిర్వహించారు. బాలమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సహా 62 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వారు వేడుకలో పాల్గొన్నారు. ఆమె భర్త రాజిరెడ్డి ఏడేళ్ల క్రితం మృతి చెందాడు. ఇప్పటికీ ఆమె కంటిచూపు, దంతాలు బాగున్నాయి. ప్రస్తుతం ఆమె కర్ర సాయంతో నడుస్తున్నారు. తన పని తాను సాఫీగా చేసుకోగలుగుతున్నారు. మొదటి నుంచీ ఆమె శాకాహారి. పూర్వకాలంలో తీసుకున్న సహజసిద్ధమైన ఆహారంలో సత్తువ ఉండేదని ఆమె చెప్పారు. మక్క గట్క ఎక్కువగా తీసుకునేదాన్నని చెప్పారు. కాలుష్య ప్రభావం తక్కువగా ఉండటంతో ఆరోగ్యకరంగా జీవిస్తున్నానని తెలిపారు. వ్యవసాయ పనులు చేయడంతో శారీరక, మానసిక దృఢత్వం ఉందన్నారు. ఇప్పటి తరం వారు ఎరువులు అధికంగా వాడిన ఆహారం తీసుకోవడంతో నాణ్యత తగ్గుతోందన్నారు. నాటి కాలంలో సరుకుల కొనుగోలు, అమ్మకాలు లేవని.. కేవలం బదలు తీసుకునేవారమని ఉప్పు మాత్రమే కొనేవారమని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని