నాయకత్వ లక్షణాలపై ఉపాధ్యాయులకు శిక్షణ
ఉపాధ్యాయుల్లో నాయకత్వ లక్షణాలు పెంచేందుకు అంతర్జాలంలో శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలల నిర్వహణకు సంబంధించిన విషయాలు వివరించనున్నారు.
అంతర్జాలంలో దరఖాస్తుకు అవకాశం
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: ఉపాధ్యాయుల్లో నాయకత్వ లక్షణాలు పెంచేందుకు అంతర్జాలంలో శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలల నిర్వహణకు సంబంధించిన విషయాలు వివరించనున్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ, జాతీయ విద్యా ప్రణాళిక పరిపాలన యూనివర్సిటీ ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కథనం.
రిజిస్ట్రేషన్ ఇలా..: నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఇచ్చే శిక్షణలో పాల్గొనాలంటే www.pslm.niepa.ac.in అంతర్జాలంలో పేరు, వివరాలు, మెయిల్ ఐడీ, ఉద్యోగి సంఖ్య, చిరుమానా తదితర వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకోసం యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సిద్ధం చేసుకోవాలి. వివరాలు నమోదు చేసుకున్న తరువాత కోర్సు ప్రారంభమైన రోజు నుంచి అంతర్జాలంలోని స్టడీ మెటీరియల్ చదువుకోవాలి. రెండు నెలల పాటు శిక్షణ పూర్తయిన తరువాత అంతర్జాలంలో పరీక్ష నిర్వహిస్తారు.
నేర్పించే అంశాలు: జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ, కస్తూర్బా, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే ఉపాధ్యాయులు శిక్షణ పొందేందుకు అర్హులు. జిల్లాలో 1628 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9,280 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఉపాధ్యాయులకు నాయకత్వం, సమర్థ నిర్వహణ, అభివృద్ధి అనే విషయాలపై అంతర్జాలం కోర్సును ప్రాంరంభించింది. ఇందులో 7 అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. పాఠశాల నాయకత్వం, బోధన, అభ్యసన ప్రక్రియలు, బృంద కృషి, ఆవిష్కరణలు, ప్రముఖుల భాగస్వామ్యం, పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా బోధనలో మంచి ఫలితాలు సాధించవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి - అనూరాధ, ఏఎంవో
ఉపాధ్యాయులు అంతర్జాల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే శిక్షణ ఇస్తారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య