logo

చేప వంటకాల ప్రదర్శన నేటి నుంచి

 రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8, 9, 10 తేదీల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల ఆహార దినోత్సవాలను (ఫుడ్‌ ఫెస్టివల్స్‌)ను నిర్వహించనున్నారు.

Updated : 08 Jun 2023 06:15 IST

న్యూస్‌టుడే, మెదక్‌ టౌన్‌: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8, 9, 10 తేదీల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల ఆహార దినోత్సవాలను (ఫుడ్‌ ఫెస్టివల్స్‌)ను నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మృగశిర కార్తెను పురస్కరించుకుని మూడు రోజుల పాటు జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను ఇటీవల ఆవిష్కరించారు.

20 స్టాళ్లు.. వివిధ రకాల వంటలు

ఈ వేడుక సందర్భంగా దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు 20 మంది మత్స్యకారులు ముందుకు వచ్చారు. మొదటి రోజు పాలనాధికారి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాలను ఎమ్మెల్యే, పాలనాధికారి, ఇతర ప్రజాప్రతినిధులు  ప్రారంభిస్తారు. రెండో రోజు 9 నుంచి 10వ తేదీ వరకు పట్టణంలోని ద్వారకా గార్డెన్స్‌లో జరగనున్నాయి. విజయ డెయిరీ, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఒక దుకాణాన్ని, మిగతా వాటిల్లో చేపల, రోయ్యల బిర్యాని, పలు రకాల పచ్చళ్లు, తదితరాలను ప్రదర్శించనున్నారు.

తయారీపై అవగాహన

ఈ ఉత్సవాల్లో మత్స్యకారులు, మహిళలకు పలు రకాల వంటల తయారీపై అవగాహన కల్పించనున్నారు. స్టాళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అయ్యే విద్యుత్తు ఖర్చు, తదితర వసతులను మెదక్‌ జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందించనున్నారు. దుకాణాల నిర్వాహకులు కేవలం వారు తయారు చేసే వంటలు, అందుకు సంబంధించిన పదార్థాలను మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది.


భోజన ప్రియులకు పండుగ
- రజనీ, మత్స్యశాఖ అధికారిణి

చేపల వంటలపై ఆసక్తి ఉన్నవారికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. వివిధ రకాల మీనాలు అందుబాటులో ఉండడంతో పాటు, తక్కువ ధరకు లభించనున్నాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్సవాలను విజయవంతం చేయాలి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని