చిన్నారుల భవితకు బాటలు
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతోపాటు, పౌష్టికాహారం అందిస్తున్నారు. పోషణలోపంతో ఇబ్బందులు పడుతున్న వారికి అదనపు ఆహారం ఇస్తున్నారు.
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ బాట
12 వరకు కొనసాగనున్న కార్యక్రమాలు
పెద్దశంకరంపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న సిబ్బంది
న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతోపాటు, పౌష్టికాహారం అందిస్తున్నారు. పోషణలోపంతో ఇబ్బందులు పడుతున్న వారికి అదనపు ఆహారం ఇస్తున్నారు. ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ ఆధ]్వర్యంలో అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెండున్నరేళ్ల పిల్లలను తప్పకుండా కేంద్రాలకు పంపించేలా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట, అల్లాదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లున్నాయి. వీటి పరిధిలో 885 ప్రధాన కేంద్రాలు, 191 మినీ ఉన్నాయి. 6 ఏళ్ల లోపు చిన్నారులు 53,319, గర్భిణులు 6,536, బాలింతలు 6,574 మంది నమోదై ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా టీచర్లు రెండున్నర నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులను గుర్తించి వారిని కేంద్రాలకు పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్రాల పరిధిలో ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. అంగన్‌వాడీ స్థాయి పర్యవేక్షణ, సహాయక కమిటీ బృందాలు పిల్లల నమోదు సంఖ్యను పెంచేందుకు దోహదపడతాయి.
చేపడుతున్న కార్యక్రమాలు..
రెండున్నరేళ్ల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలి. పౌష్టికాహారం ఆట, పాటలతో వారికి బోధన, పిల్లల మానసిక, శారీరక వృద్ధి, వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు చేస్తారు, ఒక పూట సంపూర్ణ భోజనం, గుడ్డు అందిస్తారు, సామూహిక అక్షరాభ్యాసాలు చేయిస్తారు, ఎల్‌కేజీ పిల్లలకు తంగేడు పువ్వు, యూకేజీ పిల్లలకు పాలపిట్ట పుస్తకాలు ఉచితంగా అందిస్తారు. ఇలా సిబ్బంది వారి కేంద్రాల పరిధిలో కార్యక్రమాలు చేపడుతూ పిల్లల చేరికలకు కృషి చేస్తున్నారు.
నమోదు పెంచుతాం.
- బ్రహ్మాజీ, జిల్లా సంక్షేమాధికారిణి
అన్ని కేంద్రాల పరిధిలో రెండున్నరేళ్ల చిన్నారులను గుర్తించి వారిని కేంద్రాల్లో నమోదు చేయించేలా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఈ అంగన్‌వాడీ బాట ద్వారా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తూ సిబ్బంది చేరికలు జరిపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Social Look: ధోనీ - రామ్‌చరణ్ మీట్.. మాళవిక నో ఫిల్టర్ లుక్.. నిధి క్వీన్..!
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల
-
Chandrababu Arrest: ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్: బాలకృష్ణ
-
Jammu Kashmir: కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి