logo

చెరువు మాదంటే మాది

చేపల కోసం రెండు గ్రామాల మధ్య పంచాయతీ ఏర్పడింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హుస్నాబాద్‌ మండలంలోని ఉమ్మాపూర్‌, నాగారం గ్రామాల శివారులో మహాసముద్రం చెరువు, భైరోని చెరువు ఉన్నాయి.

Updated : 09 Jun 2023 06:13 IST

బైరోని చెరువు గట్టుపై నాగారం గ్రామస్థులు

హుస్నాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: చేపల కోసం రెండు గ్రామాల మధ్య పంచాయతీ ఏర్పడింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హుస్నాబాద్‌ మండలంలోని ఉమ్మాపూర్‌, నాగారం గ్రామాల శివారులో మహాసముద్రం చెరువు, భైరోని చెరువు ఉన్నాయి. మత్స్యకార్మికులు కలిసి చేపలు పట్టుకునే వారు. వారి వాటా(పాలు) ప్రకారం పంచుకునేవారు. మహాసముద్రం చెరువు గండి పూడ్చివేసినప్పటి నుంచి రెండు గ్రామాల మత్స్యకార్మికుల మధ్య వివాదం తలెత్తింది. చెరువు మాదంటే మాదని, చేపలు పట్టుకునే హక్కు మాకేనని రెండు గ్రామాలవారు పట్టుబడుతున్నారు. రెండేళ్ల క్రితం పరస్పరం దాడులు చేసుకున్నారు. నాగారానికి బైరోని చెరువు, ఉమ్మాపూర్‌కు మహాసముద్రం చొప్పున ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ సూచనతో గతంలో పంపకాలు జరిగాయంటున్నా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. నాగారం గ్రామస్థులు గురువారం ఉదయం చేపలు పట్టేందుకు వెళ్లగా ఉమ్మాపూర్‌ వారు ఆందోళనకు దిగారు. నాగారం వాసులు చెరువు గట్టునే వంటావార్పుతో నిరసన తెలిపారు. గొడవ జరుగుతుండగా 100 నంబరుకు ఫోన్‌ చేస్తే పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. పరిష్కారమయ్యే వరకు చేపలు ఎవరూ పట్టొద్దని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని