రామాయంపేటను డివిజన్‌గా ప్రకటించాల్సిందే..
రామాయంపేటను వెంటనే డివిజన్‌గా ప్రకటించాలని, లేదంటే మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గ్రామాల్లో తిరగనివ్వమని, త్వరలో మెదక్‌లో జరుగనున్న సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు.
తొలిరోజు స్వచ్ఛందంగా బంద్
దీక్షా శిబిరంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి తదితరులు
రామాయంపేట, న్యూస్‌టుడే: రామాయంపేటను వెంటనే డివిజన్‌గా ప్రకటించాలని, లేదంటే మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గ్రామాల్లో తిరగనివ్వమని, త్వరలో మెదక్‌లో జరుగనున్న సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలనే డిమాండ్‌తో అఖిలపక్షం 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. తొలి రోజు పట్టణంలో అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీక్ష 75 రోజులుగా కొనసాగుతున్నా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి విషయంలోనూ ఎమ్మెల్యే విఫలమైందని విమర్శించారు. స్థానికులు స్వచ్ఛందంగా బంద్ పాటించారని, ఇది చూసైనా స్పందించాలని, లేదంటే వారం పాటు బంద్ చేపడతామని ఐకాస నాయకులు స్పష్టంచేశారు. భాజపా అధికార ప్రతినిధి నందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో మూసి ఉంచిన దుకాణాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు.. ప్రత్యేక మెసేజ్ పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
-
Team India: ఇక్కడో జట్టు.. అక్కడో జట్టు.. కొత్త పుంతలు తొక్కుతున్న భారత క్రికెట్
-
800 Movie: విజయ్ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యలు
-
Hyderabad: గణేశ్ నిమజ్జనానికి MMTS ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..!
-
Hyderabad: తెలంగాణ పోలీసింగ్ ఓ సక్సెస్ స్టోరీ: డీజీపీ
-
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు