పేదలకు ఊరట
రెక్కాడితేనే డొక్క నిండని నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. రోజూ పనికి వెళితేనే కుటుంబ పోషణ సాగేది. ఇలాంటి కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యం బారినపడితే ఆర్థికంగా ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
జనరిక్ ఔషధ దుకాణాల ఏర్పాటుకు కార్యాచరణ
మహిళా సంఘాలకు అవకాశం
సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మందుల దుకాణం
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్, జోగిపేట: రెక్కాడితేనే డొక్క నిండని నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. రోజూ పనికి వెళితేనే కుటుంబ పోషణ సాగేది. ఇలాంటి కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యం బారినపడితే ఆర్థికంగా ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా మందులు(ఔషధాలు) ఎక్కువగా బయటే కొనాల్సి ఉండటమే దీనికి కారణం. దుకాణదారులు ఎంత చెబితే అంత చెల్లించాల్సిందే. అప్పు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పేదలకు ఊరట కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జనరిక్ మందుల దుకాణాలను నిర్వహిస్తోంది. మహిళా సంఘాల ఆధ్వర్యంలోనూ ఈ ఆర్థిక సంవత్సరంలో జనరిక్ మందుల దుకాణాలకు స్త్రీనిధి రుణాల మంజూరుకు నిర్ణయించిన నేపథ్యంలో కథనం.
స్త్రీనిధి రుణ సదుపాయం
జనరిక్ దుకాణంలో తక్కువ ధరకే మందులు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు బయటి దుకాణాల్లో రూ.30 విలువచేసే కొన్ని మందులు ఇక్కడ రూ.10కే విక్రయిస్తారు. ప్రస్తుతం జనరిక్ దుకాణం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తక్కువ ధరకే ఔషధాలు లభిస్తుండటంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు జనరిక్ ఔషధాలు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యుల్లో అర్హులకు దుకాణాల ఏర్పాటుకు స్త్రీనిధి రుణాలను ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఒక్కో దుకాణం ఏర్పాటుకు రూ.3లక్షల వరకు రుణం అందించనున్నారు. మండలానికి ఒకటి, మున్సిపాలిటీల్లో అంతకంటే ఎక్కువ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
మంజూరు ఇలా..
* స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలు కావడంతో పాటు వారి కుటుంబం, దగ్గరి బంధువుల్లో ఎవరైనా డిఫార్మసీ, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ విద్యార్హత కలిగి ఉండాలి.
* రుణం పొందడానికి ముందు సంబంధిత సభ్యురాలి సంఘం, గ్రామైక్య సంఘం తీర్మానం తప్పనిసరి.
* దుకాణం నిర్వహణకు డ్రగ్ ఇన్స్‌పెక్టర్ అనుమతి, ధ్రువీకరణపత్రం, కొటేషన్, విద్యార్హత తదితర పత్రాలతో స్త్రీనిధి అధికారులకు దరఖాస్తు చేయాలి.
* అధికారులు దరఖాస్తులు పరిశీలించి అర్హులుగా భావిస్తే వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు * జనరిక్ దుకాణం కోసం తీసుకునే రుణాన్ని ప్రతినెలా వాయిదాల రూపంలో ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి
జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకు స్త్రీనిధి ద్వారా తక్కువ వడ్డీకే ఇస్తున్న రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబంలో ఎవరైనా దుకాణం ఏర్పాటుకు అవసరమైన విద్యార్హత కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవాలి. సులభ వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
మోహన్‌రెడ్డి, స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
-
Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్.. స్టార్ హీరోకి తల్లిగా!
-
Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్‌పవార్ ఏమన్నారంటే..