కన్న తండ్రే కాలయముడు
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కఠినంగా మారాడు. మద్యం మత్తులో రెండేళ్ల కూతురిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
మద్యం మత్తులో రెండేళ్ల బాలికపై దాడి
తీవ్ర గాయాలతో మృతి
నందిని
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌టుడే: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కఠినంగా మారాడు. మద్యం మత్తులో రెండేళ్ల కూతురిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాలిక మృతిచెందింది. ఈ ఘటన ఈ నెల 14న జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకోగా ఆదివారం వెలుగు చూసింది. సంగారెడ్డి డీఎస్పీ రమేశ్‌కుమార్ తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం సిర్పూర్ శివారు ఎర్రకుంట తండాకు చెందిన ముడావత్ సురేష్ రెండు నెలల క్రితం భార్య, కూతురితో కలిసి సంగారెడ్డిలోని కింది బజారుకు వచ్చారు. అద్దె అంట్లో నివాసముంటున్నారు. సురేష్ నిత్యం అతిగా మద్యం తాగడంతో పాటు జులాయిగా తిరిగేవాడు. ఆయన భార్య ఓ మిర్చీ కొట్టు వద్ద కూలీగా పనిచేస్తోంది. ఈ నెల 14న వనిత చిన్నారిని తీసుకొని కూలీకి వెళ్లింది. సురేష్ భార్య వద్దకు వెళ్లి రూ.100 తీసుకున్నాడు. పక్కనే ఉన్న వైన్స్‌లో మద్యం తాగాడు. మళ్లీ భార్య వద్దకు వెళ్లి.. కూతురిని తీసుకొని ఇంటికి వెళ్లాడు. విధులు ముగించుకొని రాత్రి 10 గంటకు వనిత ఇంటికి వెళ్లింది. అప్పటికే నందిని చెవుల్లో నుంచి రక్తస్రావం అవుతుండటంతో పాటు.. ముఖంపై గాయాలున్నాయి. ఆందోళన చెందిన ఆమె భర్తను నిలదీయగా.. మద్యం మత్తులో బాలిక ముఖంపై కొట్టినట్లు తెలిపాడు. ఆమె వెంటనే స్థానికుల సాయంతో స్థానిక జిల్లా ఆసుపత్రికి కూతురిని తీసుకెళ్లింది. అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు తెలిపారు. నందిని అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆదివారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nitin Gadkari : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ మాదే కానీ..: గడ్కరీ
-
BJP: తెలంగాణకు రెండో వారంలో అమిత్‌షా.. 6న నడ్డా
-
World Culture Festival: శాంతి, సామరస్య ప్రపంచం కోసం అందరం కలిసి కృషి చేయాలి!
-
Sudheer Babu: భూతద్దంతో ఈ సినిమాని చూడొద్దు: సుధీర్ బాబు విజ్ఞప్తి
-
Delhi: ఆ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులూ ఇంజినీర్లే.. బాంబుల తయారీలో నిష్ణాతులు
-
Atchannaidu: తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసేంత నేరం బండారు ఏం చేశారు?: అచ్చెన్న