logo

విద్యార్థి ప్రతిభ

మాటలు రాకపోయినా.. చెవులు వినిపించకపోయినా.. ఆవేదనకు గురికాకుండా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు ఆ విద్యార్థి. బొమ్మలు తయారు చేయడంలో, చిత్రాలు గీయడంలో సృజన చాటుతున్నాడు

Published : 22 Sep 2023 06:16 IST

కెమెరాను చూపుతున్న మదన్‌

శివ్వంపేట, న్యూస్‌టుడే: మాటలు రాకపోయినా.. చెవులు వినిపించకపోయినా.. ఆవేదనకు గురికాకుండా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు ఆ విద్యార్థి. బొమ్మలు తయారు చేయడంలో, చిత్రాలు గీయడంలో సృజన చాటుతున్నాడు. శివ్వంపేట గ్రామానికి చెందిన అల్లపురం నర్సింహులు, మాలతి దంపతులకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు మదన్‌ ఉన్నారు. మదన్‌కు మాటలు రావు, చెవులు వినిపించవు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. వృథా వస్తువులతో విక్రమ్‌ ల్యాండర్‌, రోవర్‌ను తయారు చేశాడు. వచ్చే నెలలో నిర్వహించే వైజ్ఞానిక వేదికపై ప్రదర్శించనున్నాడు. ఇందుకోసం అట్టలు, ఐస్‌క్రీమ్‌ పుల్లలు, ఇతర వస్తువులను ఉపయోగించాడు. గురువారం ఆ నమూనాను పాఠశాలకు తీసుకురాగా హెచ్‌ఎం బాలచంద్రం, ఉపాధ్యాయుడు రమేశ్‌ విద్యార్థిని అభినందించారు. గతేడాది కెమెరాను కూడా రూపొందించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని