logo

గొప్ప నాయకుడిని కోల్పోయాం

రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్‌ఎస్‌ వాసురెడ్డి మృతికి ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు. గురువారం వాసురెడ్డి మరణించిన సమాచారం తెలియగానే ఎమ్మెల్యే రఘునందన్‌రావు పొలంపల్లికి వెళ్లి వాసురెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించారు

Published : 22 Sep 2023 06:17 IST

నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

చేగుంట, న్యూస్‌టుడే: రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్‌ఎస్‌ వాసురెడ్డి మృతికి ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు. గురువారం వాసురెడ్డి మరణించిన సమాచారం తెలియగానే ఎమ్మెల్యే రఘునందన్‌రావు పొలంపల్లికి వెళ్లి వాసురెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  మంచి నాయకుడిని కోల్పోయామన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, భూపాల్‌, బాలేష్‌గౌడ్‌ ఉన్నారు.  

  •  చిన్న గ్రామం నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన గొప్పనాయకుడని, ఆయనను కోల్పోయామని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సంతాపం తెలిపారు. చేగుంట, నార్సింగి ఎంపీపీలు శ్రీనివాస్‌, సబిత, జడ్పీటీసీ శ్రీనివాస్‌, కృష్ణారెడ్డి, భారాస మండలాధ్యక్షుడు వెంగళరావు, మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ బాధ్యుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సంతాపం తెలిపారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని