logo

ఆకట్టుకున్న నాటిక.. అలరించిన పాట

ఓటరు నమోదు.. హక్కు వినియోగంపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

Published : 22 Sep 2023 06:19 IST

నాటిక ప్రదర్శనలో విద్యార్థులు

మెదక్‌, న్యూస్‌టుడే: ఓటరు నమోదు.. హక్కు వినియోగంపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. నాటిక, పాటల పోటీల్లో మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి జిల్లా స్థాయిలో పోటీ నిర్వహించారు. ఆయా పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. యువ ఓటర్లు.. భవిష్యత్తు ఓటర్లు అంశంపై నాటిక, భవిష్యత్తు ఓటర్లు అంశంపై పాటల పోటీ నిర్వహించారు. యువఓటర్లు అంశంపై గిరిజన మహిళా డిగ్రీకళాశాల, మెదక్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సాపూర్‌, డైట్‌ కళాశాల, హవేలిఘనపూర్‌ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. భవిష్యత్తు ఓటర్ల అంశంలో కస్తూర్బా పాఠశాల, చిప్పల్‌తుర్తి, ఆదర్శ పాఠశాల, చేగుంట, కస్తూర్బా పాఠశాల, రామాయంపేట ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో... పాటల పోటీలో ప్రవళ్లిక( తంపులూర్‌, టేక్మాల్‌), నందిని (గురుకుల పాఠశాల, మెదక్‌), స్నేహ (ఆదర్శ పాఠశాల, రేగోడ్‌) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు పాలనాధికారి రాజర్షిషా బహుమతులు, నగదు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకుని, హక్కును వినియోగించుకోవాలన్నారు.

ఖాతాలను తెరిపించాలి: కలెక్టర్‌

గృహలక్ష్మి పథకానికి ఎంపికయ్యే లబ్ధిదారులతో బ్యాంకు ఖాతాలను తెరిపించేలాని పాలనాధికారి రాజర్షిషా ఆదేశించారు. గురువారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. అదనపు పాలనాధికారి రమేష్‌, జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ, జిల్లా అధికారులు శైలేష్‌ కుమార్‌, శ్రీనివాస్‌, రవిప్రసాద్‌, కృష్ణమూర్తి, ఏసయ్య పాల్గొన్నారు.

రుణాల పునరుద్ధరణకు రూ.400 కోట్లు

అన్నదాతలకు రుణాలు ఇచ్చేందుకు జిల్లాకు రూ.400 కోట్లు విడుదల అయ్యాయని పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. రుణమాఫీలో లబ్ధిపొందిన వారికి రుణాలను రెన్యూవల్‌ చేసి, నగదు అందజేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాలోని వివిధ మండలాల  వ్యవసాయ, బ్యాంకు అధికారులతో  టెలీకాన్ఫరెన్స్‌  నిర్వహించి మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని