logo

తెరాస హయాంలోనే స్థానిక సంస్థలకు గుర్తింపు: మంత్రి

పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి ఎంసీ కోటిరెడ్డి అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం నల్గొండ, మునుగోడు స్థానిక సంస్థల ఓటర్లు జడ్పీటీసీలు,

Published : 05 Dec 2021 03:19 IST


నల్గొండ: మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి ఎంసీ కోటిరెడ్డి అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం నల్గొండ, మునుగోడు స్థానిక సంస్థల ఓటర్లు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగర్‌ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కోటిరెడ్డికి అవకాశం కల్పించారని.. దీనికి ప్రతి ఓటరు సహకరించాలన్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాతే స్థానిక సంస్థలకు గుర్తింపు, గౌరవ వేతనాలిస్తున్నట్లు చెప్పారు. కోటిరెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్రతి ఓక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. మునుగోడు నియోజక వర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంసీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని